మనం ఒకరికి కాల్ చేస్తాం. అవతల ఫోన్ ఎత్తి, "ఒక్క 10 నిమిషాల్లో చేస్తా" అని పెట్టేస్తారు. ఆ 10 నిమిషాలు ఎన్నటికీ రాదు. వాళ్ళు చెయ్యరు.
మళ్ళీ మనం చేసినప్పుడు, ఇదంతా మర్చిపోయి, మనం అప్పుడే ఫోన్ చేసినట్టు, "చెప్పండి" అంటారు!
ఏదో బిజీలో ఉంటారు కదా అన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ మెసేజ్ పెడ్తాం. రోజుకొకటి పెడుతూనే ఉంటాం. మనకక్కడ అతను ఆన్ లైన్లో ఉన్నట్టు తెలుస్తుంటుంది, లాస్ట్ ఎప్పుడు చూసిందీ తెలుస్తుంటుంది.
వారి బిజీ వారిది. వారి సమస్యలు వారివి. మనమేం దీని గురించి అడగము. అయినా చెప్తారు: "4 రోజుల తర్వాత ఇప్పుడే ఫోన్ నా చేతికి వచ్చింది" అని!
అసలు 4 రోజులు ఫోన్ లేకుండా - సిటీ నడిబొడ్డున - ఏ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు?
కేస్ #2:
నేను: "నీకు వీలయ్యే టైమే చెప్పు. ఆ టైమ్‌కు కాల్ చెయ్యి. ఒకవేళ నువ్వు ఆ టైమ్‌కు చెయ్యలేకపోతే, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టు. నీ బిజీ పనుల్లో ఇది కూడా మర్చిపోయే అవకాశముంటుంది కాబట్టి - టైమ్ చెప్పు, నేనే కాల్ చేస్తా"
అతను: సమస్యే లేదు. నేను చేస్తా కదా... 10 - 11 మధ్య చేస్తా.
11 అయిపోతుంది. సాయంత్రం 7 కూడా అయిపోతుంది. కాల్ రాదు. "ఇప్పుడు చెయ్యలేను" అని చిన్న మెసేజ్ కూడా రాదు.
మళ్ళీ నేను కాల్ చేస్తే, "మీటింగ్‌లో ఉన్నాను. అయిపోగానే చేస్తాను" అని ఒక మెసేజ్ వస్తుంది.
ఆ మీటింగ్ ఎన్నటికీ అయిపోదు. నాకు కాల్ రాదు.
కట్ చేస్తే -
ఈ రెండు కేసుల్లో - ఇద్దరికీ వ్యక్తిగతంగా నేను అత్యధిక ప్రాధాన్యమిస్తాను. వాళ్ల కాల్ గాని, మెసేజ్ కాని వస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను. అది నా అలవాటు.
అలాగని, అందరూ నాలాగే ఉండాలని నేనెప్పుడూ అనుకోను. చాయిస్ వారికే ఇస్తాను. అయినా సరే, 90% ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది.
ఇలాంటి ఉదాహరణల్లో ఎదుటివారిని తప్పుపట్టడానికి లేదు. అది వారి ఇష్టం. వారి బిజీ, వారి టెన్షన్స్, వారి తలనొప్పులు వారికుంటాయి.
అయితే - "అవతలివారి ప్రయారిటీ లిస్టులో మనం ఎక్కడున్నాం" అన్న విషయాన్ని మాత్రం ఇలాంటివి మనకు బాగా స్పష్టం చేస్తాయి.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani