ఇలాంటిదేదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప మనం కొన్ని నిమిషాలయినా ఆగి, అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాను, ఎన్ని బాధ్యతలున్నాయి, టైమ్ చూసుకుంటున్నామా అసలు... అనే యాంగిల్‌లో ఫోకస్‌డ్‌గా ఆలోచించము. ఈ కోణంలో నాకు ఉగాది చాలా ముఖ్యమైంది. అలాగే న్యూ ఇయర్ కూడా.
కట్ చేస్తే -
రాత్రి నుంచి ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి గ్రీటింగ్, ప్రతి మెసేజ్‌కూ రిప్లై ఇచ్చాను. నేనుగా ఒకరిద్దరు పెద్దవాళ్లకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను.
2021 లో కనీసం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. 2 పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను.
ఇవి ప్రత్యేకంగా గోల్స్ లాంటివి కాదు. ప్రొఫెషనల్‌గా నా పనిలో భాగం. చేస్తున్నాను. అంతే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani