ఇలా అని గతంలో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ గురించి అంటుండేవాళ్ళు.
కాని, సోషల్ మీడియా వచ్చాక, ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయింది!
మరీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యాండ్రాయిడ్ వాడే ప్రతి సగటు మనిషి జీవితాన్ని ఒక రచ్చబండ చేసేశాయి.
బయటివాడెవడో అస్సలు తనకు సంబంధం లేనివాని పర్సనల్ విషయాల్ని గెలకటం ఒక టైపు రచ్చ. కాగా, ఎవరికివారే వాళ్ల కుటుంబ విషయాల్ని, ఇతర పర్సనల్ విషయాల్ని ఓపెన్‌గా వాల్స్ పైన పెట్టుకోవడం ఇంకో టైపు రచ్చ. పైగా, వీటికి లైక్ కొట్టి కామెంట్ చెయ్యలేదని అలకలూ, నిష్టురాలూ... కొండొకచో ఆ విషయం మీద కూడా పోస్టులు, ట్వీట్లు!
కట్ చేస్తే -
9 నెలల పాండెమిక్-లాక్‌డౌన్ ప్రభావమైనా మనలో కనీసం ఒక్క శాతం మార్పునైనా తీసుకురాలేదంటే - మనలో ఏదో లోపం ఉన్నట్టే! ముందు దానిగురించి ఆలోచించాలి.
జర్నలింగ్-లేదా-డైరీ రాసుకోవడంలో తప్పులేదు. ఒక మంచి అలవాటు కూడా! దానివల్ల అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి 24 గంటలకు ఒకసారి మనకి మనం చూసుకుంటాం. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకెళ్తుంటాం.
చాలావరకు బ్లాగింగ్ కూడా ఇలాంటిదే. ఎన్నో దురలవాట్లకంటే ఈ ఎడిక్షన్ చాలా బెటర్. బ్లాగింగ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే మన ఆలోచనా విధానం, మన మైండ్‌సెట్ ఎటుపోతున్నాయో మనకు తెలుస్తుంటుంది. మనం ఎటుపోతున్నామో కూడా మనకు తెలుస్తుంది.
బ్లాగింగ్ మంచి స్ట్రెస్‌బస్టర్ కూడా.
వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా - సోషల్‌మీడియాను నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే చాలా విషయాల్లో అదొక గోల్డ్ మైన్ అంటే అతిశయోక్తికాదు.
సోషల్‌మీడియాకు సంబంధించినంతవరకూ... 2021లో నేను పూర్తిగా ఆ దిశలోనే వెళ్తున్నాను. మిగిలిన అన్ని విషయాల్లో 10 రెట్లు వేగం పెంచాను.
సమయం చాలా విలువైంది. అది ఎవ్వరికోసం ఆగదు.
జీవితం ఒక్కటే. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani