మొన్న జనవరి 1 నుంచే మ్యాగజైన్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభిద్దామని అనుకున్నాను. కొన్ని ప్రొఫెషనల్ కారణాలవల్ల, ఇంకా, నా శ్రేయోభిలాషులైన కొందరు పెద్దవాళ్ల సలహా అనుసరించి కూడా ఆ పని చేయలేదు.
మనోహరమ్ మ్యాగజైన్ పూర్తి వెర్షన్ అఫీషియల్ లాంచ్ ఈ నెల 28 వ తేదీనాడు ఉంటుంది.
ఎవరు లాంచ్ చేస్తారన్నది 2, 3 రోజుల ముందు తెలియజేస్తాను.
ఫిబ్రవరి సంచిక నుంచి "మనోహరమ్" తెలుగులో ఒక పూర్తిస్థాయి ఎలైట్ వెబ్ మ్యాగజైన్ రూపం సంతరించుకొంటోంది. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది.
కట్ చేస్తే -
ప్యాషన్, పాజిటివ్ దృక్పథమే ప్రధానంగా - నా బ్లాగింగ్ హాబీకి పూర్తిస్థాయి ఎక్స్‌టెన్షన్ ఈ మ్యాగజైన్.
ఇంతకుముందు కూడా ఒక పోస్టులో చెప్పినట్టు... సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్.
పాలిటిక్స్, హేట్రెడ్‌కు ఇందులో స్థానం లేదు.
ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది.
కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు.
జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం.
ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ప్లానింగ్స్, రీప్లానింగ్స్ అన్నీ దాటుకొని - మ్యాగజైన్‌ను ఒక ఫైనల్ వెర్షన్‌కు తీసుకురాగలిగాను.
ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు.
ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం. అందరికీ నా వందనాలు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani