సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...
ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా కొన్ని వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?
ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.
గ్యారెంటీ ఏదీ కాదు. దేనికీ లేదు.
ఆ అంకెలు, ఆ లెక్క... కళ్లముందే కనిపిస్తున్నాయి నాకు.
మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి. నేను అసలు ఊహించని ఎందరో నా కళ్ళముందే పోయారు.
కరోనా గురించి ఎవరైనా కలగన్నారా? దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రపంచాన్నే వణికిస్తోంది. లక్షలమంది చచ్చారు. లక్షలమంది చావు అంచులవరకు వెళ్ళొచ్చారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.
ఇప్పుడా కరోనా కూడా క్లయిమాక్సుకు చేరింది.
ఎందరో తిట్టుకొన్న 2020 - తన తప్పేం లేకపోయినా... గిల్టీగా, నిశ్శబ్దంగా నిష్క్రమిస్తోంది.
నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నేను మాత్రం 2020 కి చాలా థాంక్స్ చెప్తున్నాను. లాక్‌డౌన్లో ఒక కొత్త జీవనశైలిని నాకు అలవాటు చేసింది. నాలో ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు తెరలేపింది. మొత్తంగా ఒక మహా జ్ఞానోదయానికి కారణమైంది.
థాంక్యూ 2020, నేను ఆల్రెడీ 10X స్పీడ్‌లో వున్నాను. 2021 లో.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani