అంటే - జనవరి 1, 2021 నుంచి మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్‌ను దాని పూర్తిస్థాయిలో ఇకనుంచీ మీరు చూడబోతున్నారన్నమాట!
న్యూ ఇయర్ ప్రారంభం నుంచి - ఆర్టికిల్స్ విషయంలో రెగ్యులర్‌గా అప్‌డేట్ ఉంటుంది. ఇంటర్వ్యూలు, సక్సెస్ స్టోరీలు వంటివి ప్రతి వీకెండ్‌కి అప్‌డేట్ అవుతాయి.
సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్. పాలిటిక్స్, హేట్రెడ్ ఇందులో మచ్చుకైనా ఉండవు.
ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే.
సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.
'మనోహరమ్’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా వుంటాయి. అలాగే - మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి.
ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది.
కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు. జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం.
కట్ చేస్తే -
నా బ్లాగింగ్ ప్యాషన్‌కు ఎక్స్‌టెన్షనే మనోహరమ్ మ్యాగజైన్. నా వర్కింగ్ టైమ్‌లో సగం సమయం మ్యాగజైన్‌కే కెటాయిస్తున్నాను. మిగిలిన సగం సమయం నా ఇతర వ్యాపకాలకు కెటాయిస్తున్నాను.
ప్రారంభం కాబట్టి తప్పటడుగులుంటాయి. మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాకు కొండంత బలం. ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani