గత కొన్నేళ్ళుగా ఫేస్‌బుక్‌ను తిట్టుకొంటూ, ట్విట్టర్‌ను మెచ్చుకొంటూ ఉండేవాన్ని. రెండురోజుల క్రితం జరిగిన ఒకే ఒక్క సంఘటనతో నేను మళ్ళీ ఫేస్‌బుక్ మూలపురుషుడు మార్క్ జకెర్‌బర్గ్ ఫ్యాన్ అయిపోయాను.
సోషల్‌మీడియాలో వెరిఫికేషన్‌కోసం మధ్యలో అప్పుడప్పుడూ మన ఈమెయిలూ, మన మొబైల్ నంబరూ అడుగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే.
పొరపాటున మనం ఫోన్ నంబర్ మార్చుకొన్నపుడు, సెట్టింగ్స్‌కు వెళ్ళి అది వెంటనే అప్‌డేట్ చేసు కోవాలి. లేదంటే - ఏదో ఒకరోజు ఈ చిన్నపొరపాటుతో లాక్ అయిపోవాల్సివస్తుంది.
ఫేస్‌బుక్ అయితే ఇంక చాలా అడుగుతుంది: పుట్టిన ఊరు, అమ్మమ్మ పేరు, చిన్నప్పటి ఫ్రెండు, నాన్న పుట్టిన ఊరు... ఎట్సెట్రా. అయితే, ఏదో చేసి మొత్తానికి ఫేస్‌బుక్ వాడు తన యూసర్‌ని నిలబెట్టుకొంటాడు తప్ప వదులుకోడు.
ట్విట్టర్ అలా కాదట! ఫోరమ్స్‌లో చదివాను:
బై మిస్టేక్... మన మారిన మొబైల్ నంబర్ మార్చకుండా - వెరిఫికేషన్ సమయంలో "సెండ్ కోడ్ టు మై మొబైల్ నంబర్" నొక్కామా... కథ కంచికే!
ఆ కోడ్ మనం తెచ్చుకోలేం, ట్విట్టరోడు మనల్ని పట్టించుకోడు. ఎన్ని సార్లు లాగిన్ అయినా "ఎంటర్ కోడ్" అనే వస్తుంది తప్ప, అసలు ఎంటర్ కానీడు! సపోర్ట్‌కు మెయిల్ పంపినా ఏం లాభం ఉండదు. ఏదో ముందే సెట్ చేసిన చెత్త ఆన్సర్ ఏదో వస్తుంది - కొన్ని రోజుల్లో చెప్తాం అని.
ఫేస్‌బుక్ అలా కాదు. అప్పటికప్పుడు 101 ఆప్షన్స్ ఇస్తుంది. సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.
సోషల్ మీడియాలో ట్విట్టర్ టాప్‌కు రీచ్ కాలేదు అంటే ఎలా అవుద్ది?!
కట్ చేస్తే -
ఎవరైనా ట్విట్టర్ ఎక్స్‌పర్ట్ మిత్రులు సొల్యూషన్ తెలిస్తే చెప్పగలరు అని మనవి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :-)
ట్విట్టర్ వాడుతున్నవాళ్ళు... ఒకవేళ మీ నంబర్ మారినట్లైతే ముందు సెట్టింగ్స్‌కు వెళ్ళి నంబర్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే ఏదో ఒక టైమ్‌లో ఇరుక్కుపోతారు! ఇది చెప్పడానికే ఈ పోస్టు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani