కొన్ని ఊహించం మనం.
నిజంగా.
ఏదో చిన్న అసైన్‌మెంట్ అనుకున్నదీ, అంతకు ముందు ఎన్నోసార్లు అలవోగ్గా చేసిందీ ... ఏకంగా ఓ రెన్నెళ్ళపాటు ఇలా సాగుతుందని నిజంగా ఎన్నడూ అనుకోలేదు నేను.
అదీ ఇంటికి దూరంగా.
హైదరాబాద్‌కు దూరంగా.
వ్యక్తిగతం, వృత్తిగతం, భౌతికం, సామాజికం, ఆర్థికం, ఆధ్యాత్మికం ... అన్నిటినీ ప్రభావితం చేస్తూ, ఒక రెండునెలలపైనే.
ఎంత రొటీన్ జాబ్ అయినా, నా వృత్తిలో భాగమే అయినా .. ఏరకంగా చూసినా, ఇదంత చిన్న విషయం కాదు.
గత ఏడెనిమిది నెల్లలోనే, ఇలాంటి ఊహించని ఆలస్యాలు జరగటం ఇది మూడోసారి అంటే .. నేనే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది నాకు.
కట్ చేస్తే -
ఇదంతా నాణేనికి ఒకవైపే.
రెండోవైపు ఇంకో పెద్ద ఊహించని సెన్సేషన్ ...
ఇన్ని దశాబ్దాల నా అనుభవంలో ఎన్నడూ ఎదుర్కోని ఓ అతి చిన్న సాంకేతిక సమస్యలో కదల్లేనంతగా నేను ఇరుక్కుపోవడం!
నాకు నేను ఏం చెప్పుకొన్నా, నమ్మలేని విధంగా రోజులు, వారాలు గడుస్తుండటం ..
ఇలా .. ఇంత నిస్తేజంగా .. ఇంత చలనరహితంగా .. వస్తూ పోతూ .. వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ .. ఒక 70 రోజులు నింపాదిగా, నిస్తేజంగా గడచిపోవడం అనేది నిజంగా ఒక జీర్ణించుకోలేని నిజం.
మరోవైపు, ఇంకో 41 రోజుల్లో నా కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఆ పనులు చకచకా ముందుకు కదుల్తున్నాయి. ఆ ప్రిప్రొడక్షన్ పనుల్లోనే నేనూ, నా టీమ్ తలమునకలై ఉన్నాము.
ఇంక మిగిలిన పనులు అవే ఊపందుకొంటాయి.
ఈరోజునుంచీ ...
సో, వాటిగురించి ఎలాంటి బెంగలేదు.
కట్ టూ జీవితం -
ప్రవాహం దాని సహజ లక్షణాన్ని ఎప్పుడూ మర్చిపోదు ..
మనమే ఎక్కడో పొరపాటుపడతాం. మన నిర్ణయాలే ఎక్కడో తడబడతాయి.
ఎక్కడో ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతుంది.
అదే జీవితం.
ఏకోణంలో చూసినా, అప్పుడప్పుడూ ఇలాంటి ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ చాలా అవసరం.
ముఖ్యంగా నాలాంటివాడికి ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani