వైజాగ్‌లో ఉన్న నాకత్యంత ప్రియమైన ఒక ఫ్రెండ్‌కు పొద్దున్నే "ఈద్ ముబారక్" మెసేజ్ పెట్టాను. ఏదో ఒక సందర్భంలాంటి సాకు దొరికింది కాబట్టి.
బ్లూ టిక్ వచ్చింది.
"సేమ్ టూ యూ లేదు" లేదు. రిప్లై లేదు.
ఇది అనుకున్నదే.
జీవితంలోని ఏదో ఒక దశలో ఇలాంటి జెర్క్‌లు ఎవరికైనా తప్పవనుకుంటాను...
కట్ టూ రైటర్స్ బ్లాక్ -
వ్యక్తిగతమయిన, వృత్తిగతమైన అనేక టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. ఈమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు పూర్తిగా మర్చిపోయాను.
ఎప్పుడైనా ఏదో ఒకటి రాద్దామని లాపీ ఓపెన్ చేసినా, అసలేం కదలట్లేదు.
'రైటర్స్ బ్లాక్' లాగా 'బ్లాగర్స్ బ్లాక్' అన్నమాట!
థాంక్స్ టూ మై ఫ్రెండ్ .. ఈ బ్లాగర్స్ బ్లాక్‌ను బ్రేక్ చేయడంకోసమే పైన ఈద్ ముబారక్ టాపిక్‌తో ఈ పోస్టు రాయడం మొదలెట్టాను.
ఇప్పుడు కదిలింది...
బ్యాక్ టూ మై బ్లాగింగ్ -
ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.
ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.
రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.
ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇది నాకు నిజంగా తప్పనిసరి.
రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ .. ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.
నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు.
ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే.
ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను.
అదో పెద్ద జోక్.
అయితే - జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు నిజంగా నన్ను కాపాడేది ఈ థెరపీనే. ఈ యోగానే.
ఇది మాత్రం జోక్ కాదు...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani