నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక దాదాపు అర్థ దశాబ్దం దాటింది.
దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.
నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.
క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!
నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను గతంలోలాగా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.
టీవీ, న్యూస్‌పేపర్‌లను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నవారిలో కూడా ఎక్కువశాతం మంది వాటిని ఎక్కువగా మొబైల్స్‌లోనే చూస్తున్నారు, చదువుతున్నారు.
సో, ఇప్పుడంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే...
ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే.
కట్ చేస్తే -
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్... నాకు తెలిసి ఈ మూడే సోషల్‌మీడియాలో టాప్.
ఫేస్‌బుక్ మొదట్లో ఎంతో కొంత ఇష్టంగానే అనిపించేది నాకు. రోజుకి ఓ ఇరవై, ముప్పై నిమిషాలు ఎఫ్ బీ మీద గడిపేవాణ్ణి.
ఇప్పుడది నాకొక ఫిష్‌మార్కెట్‌లోని కాకిగోలలా అనిపిస్తోంది.
గత అక్టోబర్ నుంచి FB వైపు వెళ్లటంలేదు నేను.
ట్విట్టర్ బాగుంది...
'ట్వీటిన'తర్వాత మళ్లీ అటువైపు మనం చూడాలనుకొంటేనే చూస్తాం. లేదంటే లేదు.
మనం ఏ చెత్త రాసినా, ఏ మంచి రాసినా 280 క్యారెక్టర్స్‌లోనే రాయాలి.
మెదడుకి మేత...
అన్నిటినీ మించి, నిజంగా మనలో సత్తా ఉంటే... ప్రపంచంలో ఏ రంగంలోనయినా, ఏ స్థాయి వ్యక్తితోనయినా ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ చాలా సులభం.
ఎక్కువ సమయం వృధా కాదు.
ఓ పది ట్వీట్లు పెట్టినా పది నిమిషాలకంటే పట్టదు.
ఇలాంటి కొన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ట్విట్టర్‌ను "ఎలైట్ సోషల్ మీడియా" అన్నారు.
ఇన్నిరోజులూ పట్టించుకోలేదుగానీ, ట్విట్టర్ నాకు బాగా నచ్చింది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani