మొన్న జరిగిన "నమస్తే హైదరాబాద్" సినిమా మోషన్ లోగో లాంచ్ ఈవెంట్ నాలో కొన్ని కొత్త ఆలోచనలకు కారణమైంది.
మరోవిధంగా చెప్పాలంటే, అంతకుముందునుంచే నాలో ఉన్న కొన్ని ఆలోచనలకు ఈ ఈవెంట్ గట్టి బలం చేకూర్చింది.
కట్ టూ సినిమా ప్రమోషన్ -
నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక దాదాపు అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.
నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.
క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!
నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.
అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.
ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే.
ఇప్పుడు సినిమా ప్రమోషన్ కూడా అంతే.
ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఖర్చు కూడా ఎక్కువే.
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.
హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!
ఖర్చు చాలా తక్కువ.
చివరగా చెప్పొచ్చేదేంటంటే .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని తప్పవు అనిపిస్తుంది.
అది మన మైండ్‌సెట్.
కానీ, అదే సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani