ఫీజు పేమెంట్‌కు సంబంధించి, దాదాపు అసాధ్యమైన ఒక అతిపెద్ద సమస్యతో మొన్న 25 నవంబర్ రాత్రి 8 గంటలకు జె బి ఎస్ నుంచి బెంగుళూరు బస్సెక్కాము నేనూ, ప్రణయ్.
ప్రణయ్ మా పెద్దబ్బాయి. బి టెక్ సెకండియర్ ఇప్పుడు. ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో ఆ బస్సులో కూర్చుని మేం తీసుకున్న సెల్ఫీనే.
తెల్లవారితే 26 నవంబర్. నా బర్త్‌డే.
నా బర్త్‌డే విషయంలో నేనెప్పుడూ అంత ప్రత్యేకంగా ఫీలవ్వను. అదేమంత గొప్ప విషయంగా అనిపించదు నాకు. ఏదైనా నా మనసుకు నచ్చే పని నేనారోజు చేస్తే తప్ప!
ఏంటా మనసుకు నచ్చే పని అని నన్నిప్పుడు అడక్కండి. అదంత ముఖ్యమైన విషయం కాదు.
కట్ టూ 26 నవంబర్, నా పుట్టినరోజు -
పొద్దున 7 గంటలకే మేమెక్కిన 'ఐరావత' మమ్మల్ని బెంగుళూరు మెజెస్టిక్‌లో దించేసింది. క్యాబ్ మాట్లాడుకొని, అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రణయ్ కాలేజీకి బయల్దేరాము.
దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర పది నిమిషాలు క్యాబ్ ఆపి, బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేశాం ఇద్దరం.
నో బ్రషింగ్ ఆఫ్ టూత్. నో స్నానం.
బ్రేక్‌ఫాస్ట్ ముగించి, ముఖం మాత్రం ఫ్రెష్‌గా కనిపించేలా ఫేస్‌వాష్ చేసుకొని కాలేజ్‌కెళ్లాం. ఎక్కడైనా రూం తీసుకొని, ఫ్రెష్ అయి, తీరిగ్గా వెళ్లేంత సీన్‌గానీ సమయంగానీ లేదు.
కాలేజీలో హెచ్ ఓ డి నుంచి డైరెక్టర్ దాకా - కనీసం ఒక అరడజను మందితో నానా డిస్కషన్‌లు చేసి, రిక్వెస్టులు చేసి, చివరికెలాగో తాత్కాలికంగా గండం గట్టెక్కించాను. ప్రణయ్ చేతిలో కొంచెం పాకెట్‌మనీ పెట్టి, అదే క్యాబ్‌లో తిరిగి మెజెస్టిక్‌కు బయల్దేరాను.
క్యాబ్‌లో తిరిగివస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాను. ఫ్లయిటా, మళ్ళీ బస్సేనా అని. మోదీ డిమానెటైజేషన్ ఎఫెక్టు గుర్తుకొచ్చి మళ్లీ బస్సుకే డిసైడైపోయాను.
మధ్యలో బెంగుళూర్లో ఉన్న ఒక ఫ్రెండ్‌ని కలిసి, వాళ్ల ఇంట్లోనే ఓ రెండు గంటలు గడిపాను. తర్వాత కెంపెగౌడ బస్టాండ్ చేరుకొని, కంఫర్ట్ గురించి ఆలోచించకుండా, అక్కడ రెడీగా ఉన్న
జె బి ఎస్, సికింద్రాబాద్ బస్సెక్కాను.
బస్ దాదాపు అనంతపురం దాటుతున్న సమయంలో వరంగల్లో ఉన్న మా చిన్నమ్మ (పిన్ని) దగ్గర్నుంచి అంత రాత్రి సమయంలో నాకు కాల్!
75 ప్లస్ ఉన్న మా అమ్మకు అంతకు ముందురోజు కంటి ఆపరేషన్ చేశారు. అంతంత మాత్రమే కనిపించే మా అమ్మ చూపు ఆ మధ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. దానికోసం ఆపరేషన్.
గంట క్రితమే కంటిమీద బ్యాండేజ్ తీసేసి చెక్ చేశారట. ఆపరేషన్ సక్సెస్. మళ్లీ మా అమ్మ మునుపటిలా చూడగలుగుతోంది.
నా పుట్టినరోజునాడు ఇది రెండో గుడ్ న్యూస్ నాకు!
మా ప్రణయ్ ఫీజు విషయంలో ఆరోజు ఉదయం తాత్కాలికంగానైనా గండం గట్టెక్కించగలగడం మొదటి గుడ్ న్యూస్.
నా పుట్టినరోజునాడు నేను బ్రష్ చేయలేదు. స్నానం చేయలేదు. కొత్తబట్టలు వేసుకోలేదు. గుడికెళ్లలేదు. దేవుడికి దండం పెట్టుకోలేదు. ఉదయం కేవలం ఒక ఇడ్లీ, ఒక వడ తిన్నాను. వచ్చేటప్పుడు దారిలో నా ఫ్రెండ్ ఇంట్లో తినమన్నా తినకుండా ఒక కాఫీ మాత్రం తాగాను. కెంపెగౌడ బస్టాండ్‌లో బస్ ఎక్కేముందు ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగాను.
అయితేనేం ...
నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్, మెసెంజర్, వాట్సాప్, టెక్స్‌ట్ మెసేజ్‌ల రూపంలో వందలాది బర్త్‌డే విషెస్‌తో నాకింక ఆకలి అనిపించలేదు. వాటినికూడా, బస్‌లో నా ఫోన్ చార్జింగ్ పెట్టుకున్నాక, జర్నీలో అర్థరాత్రినుంచి మాత్రమే చూడగలిగాను!
అదీ మొన్నటి నా బర్త్‌డే కథ.
మా ప్రణయ్ కాలేజీలో అసాధ్యమైన పనొకటి తాత్కాలికంగానైనా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. మా అమ్మ కంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. వందలాది నా ప్రియాతిప్రియమైన మిత్రులూ, శ్రేయోభిలాషులు నాకు గ్రీటింగ్స్ చెప్పారు.
బర్త్‌డే రోజున ఏ కేక్ కట్ చేసి, ఏ మందు తాగితే వస్తుంది ఇంత మంచి కిక్?
కట్ టూ 10 జనవరి, ప్రణయ్ పుట్టినరోజు -
సరిగ్గా 45 రోజుల తర్వాత, ఇవాళ ప్రణయ్ పుట్టినరోజు. వరంగల్లో ఉన్న మా అమ్మ చనిపోయి ఇవాళ్టికి సరిగ్గా 15 రోజులు.
సెమిస్టర్ పరీక్షలైపోయి, సెలవులకి ప్రణయ్ ఇంట్లోనే ఉన్నాడు, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌చేసుకొన్న ఏదో సీరియల్ చూస్తూ.
పొద్దున్నే మా చిన్నబ్బాయి ప్రియతమ్ కాలేజీకెళ్లాడు. నా భార్య సుజాత ఏదో పని చేసుకుంటోంది. వాయిదాపడిన నా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో ఫాలో అప్ చేస్తూ నేను నా గదిలో బిజీగా ఉన్నాను.
ఎన్ని చేస్తున్నా ... నా జ్ఞాపకాల్లో అనుక్షణం మా అమ్మ.
అమ్మ జ్ఞాపకాలను ఓవర్‌టేక్ చేస్తూ నా సత్వర అవసరాలు, పనులు, ఇతర వత్తిళ్ళు.
వెరసి ... 45 రోజుల్లో రెండు పుట్టినరోజులు. ఒక మహానిష్క్రమణం.
దటీజ్ లైఫ్.
అండ్ ది షో మస్ట్ గో ఆన్ ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani