ఫేస్‌బుక్ పుణ్యమా అని ఫ్రెండ్ అనే గొప్ప పదం ఒక రొటీన్ మాట అయిపోయింది.
ఫేస్‌బుక్‌లో నాకు 5 వేలమంది ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరన్నా అన్నారంటే .. ఆ 5 వేలమంది సోకాల్డ్ ఫ్రెండ్స్ జస్ట్ FB ఫ్రెండ్స్ మాత్రమే!
అంతకు మించి ఏం లేదు.
కట్ టూ స్నేహితుడు -
ప్రతి మనిషికీ కొందరు నిజమైన ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లు కేవలం వేళ్లమీద లెక్కించగలిగేంతమంది మాత్రమే ఉంటారు.
వీళ్లతో మాత్రమే మనం మన కష్టసుఖాలూ, ఇతర ఆంతరంగిక విషయాలూ ఎలాంటి ముసుగులు లేకుండా చెప్పుకోగలుగుతాం.
ఈ స్నేహితులు మాత్రమే మన గురించి కొన్ని నిమిషాలయినా ఆలోచిస్తారు. మనం ఆ క్షణం బాధపడినా సరే, నిర్మొహమాటంగా మన తప్పుల్ని ఎత్తిచూపుతారు. ఏంచేయాలో, ఎలాచేయాలో చెప్తారు. నిర్ణయం మనకే వదిలేస్తారు.
ఈ స్నేహితులు మాత్రమే మన సంతోషాలనూ, దుఖాలనూ పంచుకుంటారు. 'నేనున్నాను' అన్న ధైర్యాన్నిస్తారు.
నా స్నేహితుల్లో వయసులో నాకంటే చిన్నవాళ్లున్నారు. పెద్దవారున్నారు.
నిజానికి, స్నేహానికి వయసుతో పనిలేదు. ఆడా మగా అన్నదాంతో కూడా పనిలేదు. అన్‌కండిషనల్‌గా మన మనసుకి నచ్చడం ముఖ్యం. ఆ ఫీల్ ఉండటం ముఖ్యం.
ఇలాంటి స్నేహితుల సంఖ్య దురదృష్టవశాత్తూ ఈరోజుల్లో చాలా తక్కువ.
కానీ, స్నేహానికి నిర్వచంగా నిలిచే ఇలాంటి నిజమైన స్నేహితులు కొందరయినా నాకున్నారని నేను గర్వంగా చెప్పుకోగలను. ఈ స్నేహితుల స్నేహానికి నేనెప్పుడూ రుణపడే ఉంటానని చెప్పుకోడానికి కూడా నాకు ఎలాంటి ఈగో లేదు.
అదీ నా స్నేహితుల గొప్పతనం.
థాంక్ యూ ఫ్రెండ్స్ ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani