"తెలంగాణ తెచ్చుడో, కె సి ఆర్ సచ్చుడో!"
ఈమాటనడానికి ఎన్ని గుండెలుండాలి? ఎంత ఆత్మ విశ్వాసం కావాలి? ఎంత సంకల్పబలం తోడవ్వాలి?
ఒక కమిట్‌మెంట్.
ఒక కన్విక్షన్.
ఒక కంపల్షన్.
ఒక్కటే గోల్.
అది తెలంగాణ సాధన.
ఎన్నో వెటకారాలు, వెక్కిరింపులు, తిట్లు, శాపనార్థాలు, ఛీత్కరింపులు, కుట్రలు, కుతంత్రాలు. ఒకటా రెండా ..
ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఇంటా బయటా నానా ప్లాన్లు.
అన్నీ ఒకవైపే గురి. ఒక్కడిపైనే గురి.
కె సి ఆర్.
అయితే - ఆ రాళ్లతోనే తనచుట్టూ ఒక శత్రునిర్భేద్య దుర్గం నిర్మించుకోగలిగిన వ్యక్తి, ఉద్యమశక్తి కె సి ఆర్. ఆ దుర్గాన్ని ఛేదించి, కె సి ఆర్ దరిదాపుల్లోకి కూడా ఏ శత్రువూ చేరుకోలేకపోయాడు.
ఆ దుర్గం మరేదో కాదు.
యావత్ తెలంగాణ ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆ జేయేసీలూ, ఈ జేయేసీలూ, సోషల్ మీడియా .. అన్నీ.
అదంతా ఒక డైనమిక్ స్ట్రాటజీ.
ఎవరెన్ని చెప్పినా, ఏం చెప్పినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా .. చరిత్ర సాక్షిగా బంగారు అక్షరాలతో చెక్కిన నిజం ఒక్కటే.
కె సి ఆర్ లేకపోతే మొన్నటి తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ వచ్చేది కాదు.
జయహో కె సి ఆర్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani