జీవితంలో ఎవరైనా, ఏ దశనుంచైనా ఒక కొత్త అధ్యాయం ప్రారంభించవచ్చు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇప్పటికే ప్రూవ్ చేసి ఉన్నారు.
చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ, కొత్త రిజల్టు రావాలనుకోవడంకన్నా ఫూలిష్‌నెస్ మరొకటుండదు.
డబ్బు, ఆస్తులు ఎంత నష్టపోయినా ఫర్వాలేదు. కానీ, చూస్తూ చూస్తూ కాలాన్ని నష్టపోకూడదు. నోటినుంచి మాటను జారవిడుచుకోకూడదు.
కాలం వెనక్కి రాదు. మాటని వెనక్కి తీసుకోలేం.
ఇలాంటి పరిస్థితుల్లో రిలేషన్‌షిప్పే నాకు చాలా ముఖ్యం తప్ప వేరే ఏ విషయం కాదు.
ఆ మరేదో విషయం మన బేసిక్ కమ్యూనికేషన్‌నే దెబ్బతీస్తున్నప్పుడు, ఆ మరేదో విషయాన్ని వదులుకోవడమే అన్నివిధాలా మంచిది. అన్నివిధాలా ఉత్తమం కూడా.
కనీసం ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌లోని ఆ పరస్పర అభిమానం, ఆ గౌరవమైనా మిగుల్తాయి.
కట్ టూ గట్స్ -
కాన్‌ఫిడెన్స్, గట్స్ ఉంటే చాలు. ఏదయినా సాధించవచ్చు.
ఈరోజే, ఈక్షణమే .. ఒక అతి చిన్న గోల్ పెట్టుకొని, దాన్ని పూర్తిచేసి పడుకోవడంతో ప్రారంభించినా చాలు. తర్వాత లక్ష్యం ఎంత పెద్దదయినా సరే, సాధించడం అనేది అలవాటయిపోతుంది.
మళ్లీ ఆ ట్రాక్ ఎక్కుతాం. ట్రాక్‌లో ఉంటాం.
అయితే .. 'మన నమ్మకాలకు, మన నిర్ణయాలకు మనమే బాధ్యులం' అనే వాస్తవాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు.
అలా మర్చిపోనంతవరకు ఏదయినా సాధ్యమే.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani