"ఆశ, కోరిక, అవసరం .. ఈ మూడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి" అంటూ బులెట్ షాట్‌లా ఒకే ఒక్క మాటతో జీవిత సారాంశాన్ని చెప్పేశాడు నా మిత్రుడు శ్రీనాథ్.
ఎంత నిజం!
ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ మూడింటి అర్థం, పరమార్థం, లక్ష్యం .. అన్నీ ఒక్కటే!
మనం అనుకున్నది పొందటం.
ఆశలు, కోరికలు ఒక స్థాయివరకే. తర్వాత ఈ రెంటికీ అంత విలువుండదు. జస్ట్ బుల్‌షిట్. చాలా లైట్ తీసుకుంటాం.
నామటుకు నేను ఇప్పటికే ఈ మూడు ముక్కల్లో మొదటి రెండు ముక్కల్ని పడేశాను. ఇంక నా చేతిలో మిగిలిన ముక్క ఒక్కటే.
అవసరం.
నిజానికి ఈ చివరి ముక్కకే ఎంతో పదును ఉంటుంది. మొదటి రెండు ముక్కల అనుభవం తర్వాత!
ఈ ముక్కతో అనుకున్నది ఏదైనా సాధిస్తాం.
అవసరం కాబట్టి ..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani