నాకత్యంత ప్రియమైన ప్రపంచస్థాయి నవలారచయితల్లో బుచ్చిబాబు ఒకరు.
ఆయన రాసిన ఒకే ఒక్క నవల .. "చివరకు మిగిలేది".
"గడ్డిపోచ విలువెంత?" అన్న సింపుల్ వాక్యంతో ఆ నవల ప్రారంభమవుతుందని నాకింకా గుర్తుంది. అదిక్కడ కోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నిర్ణయమో చివర్లో చూద్దాం.
కట్ టూ మన నిర్ణయాలు -
జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.
ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి ఇరుక్కునేదాకా.
జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.
చిన్నవీ, పెద్దవీ.
కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా .. వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా!
కట్ బ్యాక్ టూ మన గడ్డిపోచ -
ఎవరో ఏదో అనుకుంటారనో, లేదా అందరి దృష్టిలో బాగుండాలనో .. ఇష్టం లేకపోయినా, ఈగో అడ్డొచ్చినా, ఎంత కష్టమయినా .. ముందు తీసుకున్న ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటం అనేది ఓ పెద్ద తప్పుడు నిర్ణయం!
విషయం చిన్నది కావొచ్చు, పెద్దది కావొచ్చు. ఫలితాల్నిబట్టి ఎప్పటికప్పుడు తన నిర్ణయాల్ని మార్చుకోలేనివారు ఎవరైనా సరే వారి జీవితంలో చాలా కోల్పోతారు. లేదా జీవఛ్చవంలా బ్రతుకుతుంటారు. పరోక్షంగా మరెందరి జీవితాలో ప్రభావితం కావడానికి కారణమవుతారు.
ఈలోగా జీవితం తెల్లారిపోతుంది.
ఇలా జీవితాల్ని తెల్లార్చుకొనేవారు సమాజంలో 99% ఉంటారు. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రమే ఎప్పటికప్పుడు నిర్ణయాల్ని మార్చుకొంటూ సిసలైన గట్స్‌తో ముందుకెళ్తుంటారు. అనుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటారు.
అదీ తేడా.
ఈలెక్కన మనం తీసుకొనే ఒక నిర్ణయం విలువెంత?
ఒక గడ్డిపోచంత.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani