26 ఫిబ్రవరి 1990.
నాగార్జునసాగర్ ఎక్స్‌కర్షన్.
దాదాపు 26 సంవత్సరాలు కూడా గడిచింది కాబట్టి .. చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఎట్‌లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్‌కు, స్టాఫ్‌కు గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను.
ఇక్కడ విషయం మన ఎక్స్‌కర్షన్ కాదు.
నదుల్లో, కాలువల్లో బోట్ ప్రమాదాలు ఎలా జరుగుతాయో నేను చాలా లైవ్‌గా గుర్తించాను.
సుమారు 300 ప్లస్ స్టూడెంట్స్, స్టాఫ్ కు ఆరోజు అక్కడున్న ఒక్క బోట్ సరిపోదు. రెండు ట్రిప్స్ వేయడానికి లేదు. మామూలుగా ఎక్కువమంది ఉన్నప్పుడు అదే బోట్‌కు పక్కన ఫ్లాట్‌గా పెద్దగా ఉండే ఒక చెక్క బల్లని తాళ్లతో కడతారు. ఆరోజు వాళ్లు అదే చేశారు. అందరం ఎక్కాం.
సరిగ్గా మధ్యలోకి వెళ్లాక ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో బోట్ ఆగిపోయింది!
నీళ్లలో బోట్ వెళ్తున్నప్పుడు ఏంకాదు కానీ, అదే బోట్ నది మధ్యలో ఉండి ఆగినప్పుడు పరిస్థితి పిచ్చి డేంజెరస్‌గా ఉంటుంది. మన బోట్ విషయంలో కూడా అదే జరిగింది.
సాగర్ మధ్యలో ఆగిన బోట్ నీళ్ల ఊపుకి ఒక ఉయ్యాలలాగ ఊగుతోంది. దానికి తోడు పక్కన తాళ్లతోకట్టిన చెక్క బల్ల. దానిమీద ఇంకో 100 మంది స్టూడెంట్స్! దాని పరిస్థితి మరింత దారుణం.
ఏ చిన్న షేక్ వచ్చినా .. జరగరానిది జరిగిపోతుంది. మొత్తం ఓవర్ క్రౌడెడ్ బోట్, దానికి తాళ్లతో కట్టిన మరో అదనపు బరువు ఆ చెక్క బల్ల .. దానిమీద మరో 100 మంది!
అంతా తళ్లకిందులవ్వడానికి ఒక్క క్షణం చాలు.
ఎవరికివాళ్లు పైకి మామూలుగానే వున్నా, లోపల్లోపల మాత్రం భయంగానే వున్నాం మేము.
అప్పుడు సెల్ ఫోన్స్ కూడా లేవు ఇలాంటి సిచువేషన్‌లో ఉన్నాం అని ఎవరికైనా చెప్పడానికి. ఒకవేళ చెప్పగలిగినా, అప్పటికప్పుడు అక్కడికొచ్చి 300 మందిని కాపాడగలిగేంత సీన్ అక్కడ లేదు. అది వేరే విషయం.
సుమారు 40 నిమిషాల టెన్షన్ తర్వాత బోట్ రిపేర్ అయ్యి కదిలింది.
అందరం హాప్పీగా ఇంకో చివరనున్న నాగార్జునకొండకెళ్లాం. అన్నీ చూసాం. ఎంజాయ్ చేసాం. అక్కడ క్యాంటీన్‌లో తిన్నాం. మళ్లీ తిరిగి అదే బోట్ ప్లస్ చెక్కబల్లపైన మళ్లీ అదే 300 + మంది సేఫ్‌గా వెనక్కి వచ్చేశాం.
ఆల్ హాపీస్ ..
సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే .. కెపాసిటీని మించి ఎప్పుడూ బోట్ ఎక్కవద్దు. అక్కడ బోట్ నిర్వాహకులకు అది మామూలే కావచ్చు. ఏదైనా జరగరానిది జరిగితేనే కష్టం.
మన విషయంలో .. కెపాసిటీకి డబుల్ కంటే ఎక్కువమందిమి ఎక్కాం. అది కూడా చాలా రిస్కీ పధ్ధతిలో.
^^^
(This was actually posted by me yesterday night in Jawahar Navodaya Vidyalaya, Maddirala, Closed Facebook Group. Just copy pasted here to share it on my blog.)

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani