ఈ బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ నవల వచ్చే మార్చి 10 నాడు ప్రపంచమంతా విడుదల కాబోతోంది.
భరత్‌కృష్ణ తొలి నవల ఇది. అయినా, ముందే 'బెస్ట్ సెల్లర్' అని గర్వంగా చెప్పగలుగుతున్నానంటే .. అది నా నమ్మకం. రేపు కాబోయే నిజం.
చెప్పాలంటే .. ఈ నవలా రచయితకు నేను ఫ్యాన్‌ని!
కట్ టూ భరత్‌కృష్ణ -
గుంటూరులోని ఓ కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో సుమారు పాతికేళ్లక్రితం ఓ రెండేళ్లు పనిచేశాన్నేను.
ఆ రెండేళ్లలో, నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థులెందరి పేర్లో నేనిప్పుడు కూడా చెప్పగలను: రాజశేఖర్ బాబు, సి హెచ్ వి కె ఎన్ ఎస్ ఎన్ మూర్తి, బోడా సాంబశివరావు, సజ్జా సాంబశివరావు, కొల్లూరి వీరరాఘవ, సురేష్‌బాబు, ఎన్ వి ఎస్ ఆర్ కె ప్రసాద్, దిలీప్, దుర్గారామ్, మోహన్‌రావు, మస్తాన్, సత్యంబాబు, ముత్తయ్య, నాగరాజు, లక్ష్మీకుమార్; లక్ష్మీకవిత, సౌజన్య, మమత, బేబి, ఉషారాణి, రమాదేవి, వీణ, విద్య, చైతన్య, సూరం మాధవి, సుష్మ, వాగ్దేవి, లీల .. ఇలా కనీసం ఇంకో 100 మంది విద్యార్థుల పేర్లు నేను చాలా ఈజీగా చెప్పగలను.
వీళ్లంతా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నాకు గుర్తుండిపోయారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం. ఏదో ఒక ప్రత్యేకత.
అప్పటి ఆ విద్యార్థుల్లో ఇప్పుడు కొందరు ఐ ఎ యస్ లయ్యారు. ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లయ్యారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు అయ్యారు. మరెందరో మంచి బిజినెస్‌మేన్‌లయ్యారు. ఇంకెందరో రకరకాల ఫీల్డుల్లో, వివిధహోదాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు.
ప్రస్తుతం తమిళనాడులోని మధురై జిల్లా కలెక్టర్ అప్పటి మా విద్యార్థి కొల్లూరి వీరరాఘవ! మొన్న ఫిబ్రవరి 2 నాడే ప్రెసిడెంట్స్ అవార్డ్ కూడా తీసుకున్నాడు.
అప్పుడు, అలా నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరితో నాకిప్పటికీ మంచి కమ్యూనికేషన్, మరెంతో మంచి అనుబంధం ఉంది. వాళ్లను నేను అభిమానిస్తాను. చెప్పాలంటే .. వారికి నేను ఫ్యాన్‌ని.
అదిగో, అలా .. నేను భరత్‌కృష్ణకు కూడా ఫ్యాన్‌ని!
భరత్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదివిన క్రెడిట్, ఆనందం, గర్వం నాకున్నాయి. గర్వం ఎందుకంటే .. నేను చూస్తుండగా, నా కళ్లముందు ఎదిగిన నిలువెత్తు వ్యక్తిత్వం భరత్.
భరత్ ఈ నవల కాన్‌సెప్ట్‌ను అనుకున్న క్షణం నుండి, దాన్ని తను రాయడం పూర్తిచేసేవరకు ప్రతి స్టేజ్ నాకు తెలుసు. ప్రతి స్టేజ్‌లో తన భావాల్ని నాతో పంచుకున్నాడు. నిర్మొహమాటంగా తన ఉద్దేశ్యాల్ని నాకు చెప్పాడు.
బేసిగ్గా నేనూ రచయితనే కాబట్టి - నాకు తోచిన ప్రతి చిన్న అంశాన్నీ అతనితో చర్చిస్తూ, ప్రతి జాగ్రత్తనీ వివరిస్తూ, ఈ నవలను చాలా తొందరగా రాయమని భరత్‌ని బాగా పోరుపెట్టింది నేనే. అది బయటికి రావడం ఆలస్యమౌతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయిన మొదటి సాక్షిని కూడా నేనే.
కట్ టూ మార్చి 10 -
ఇప్పుడు .. అన్ని అవాంతరాలను అధిగమించి, భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్‌వాక్" నవల ఈ మార్చి 10 నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ ఎక్జైట్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న మొదటి వ్యక్తినీ, మొదటి పాఠకుడినీ నేనే కావడం నాకు మరింత ఆనందంగా ఉంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani