కనీసం ఓ 40 రోజులయినా పట్టే ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా షూటింగ్‌ను నేను, నా టీమ్ కేవలం 13 రోజుల్లో పూర్తిచేయగలిగాం.
థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్! తనవైపు నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నీ పక్కాగా, పకడ్బందీగా చూసుకున్నందుకు ..
13 రోజుల రెనెగేడ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టికల్‌గా చేసి నిరూపించుకున్నాం. మాకు మేమే.
ట్రాక్, ట్రాలీ, క్రేన్‌లు గట్రా ఏమీ లేకుండా .. వెరీ మినిమమ్ లైటింగ్, ఇక్విప్‌మెంట్‌తో!
ఆ 13 రోజుల షూటింగ్‌లో కేవలం ఓ నాలుగయిదు రోజులు మాత్రం స్టడీకామ్‌ను ఉపయోగించాం. అలాగని ఇదేదో ఆదరాబాదరా క్వాలిటీ లేకుండా చుట్టేసిన షూటింగ్ కాదు.
సూపర్ క్వాలిటీ. రిచ్ లుక్.
అంతా 'రెడ్ ఎమెక్స్' కెమెరాతో.
నా డి ఓ పి మిత్రుడు వీరేంద్ర లలిత్‌కు, హీరో అఖిల్ కార్తీక్‌కు, నా ప్యాషనేట్ టీమ్‌కు కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి.
కట్ టూ పోస్ట్ ప్రొడక్షన్ -
కెమెరా, కెమెరామన్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, లొకేషన్లు మా కంట్రోల్‌లో ఉన్నాయి కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం డే అండ్ నైట్ పనిచేస్తూ షూటింగ్ పూర్తిచేయగలిగాం.
కాని ..
పోస్ట్ ప్రొడక్షన్‌లో .. ఎడిటింగ్ నుంచి, ఫైనల్ మిక్సింగ్ దాకా పరిస్థితి మరోలా ఉంది. ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు. అంతా ఒక గందరగోళం.
ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించినంతవరకూ - ఇంకా మనవాళ్లు చాలామంది పాతరాతియుగంలోనే ఉన్నారని చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఫీలవుతున్నాను.
ఒకవైపు హాలీవుడ్‌లో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చిన్న చిన్న బ్లాక్‌మ్యాజిక్, గోప్రో లాంటి కెమెరాలతో సినిమా మొత్తం షూట్ చేసి .. ఒకే ఒక్క మ్యాక్ కంప్యూటర్‌తో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కూడా పూర్తిచేస్తూ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు.
మరోవైపు, మనం మాత్రం ఇంకా టీబ్రేక్‌లు, లంచ్ బ్రేక్‌లు, కాల్‌షీట్ టైమింగ్స్, కాకరకాయలు, వంకాయలు అంటూ .. లెక్కలూ తూకాలూ వేసుకుంటూ, ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తున్నాం.
కట్ చేస్తే -
నా తర్వాతి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇలా మాత్రం ఉండదు!
ఫాక్టరీకి పునాదులు పడుతున్నాయి ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani