ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్, డబ్బు లేకుండా సినీ ఫీల్డులో హీరోగా అసలు ఎంట్రీనే కష్టం.
కానీ, ఏ సపోర్ట్ లేకుండానే - కేవలం తన యాక్టింగ్ టాలెంట్స్‌ని ప్రదర్శించి - ఓ మంచి దర్శకుడి సినిమాలో, భారీ బ్యానర్‌లో ఎలాగో హీరోగా అవకాశం దొరికించుకున్నాడు ఓ కుర్రాడు.
ఆ సినిమా హిట్ అవలేదు.
కట్ చేస్తే, ఎవరయినా సరే "పీఛే ముడ్" అనక తప్పదు. లేదంటే, ఏ చిన్నా చితక పాత్రలకో పరిమితం కాక తప్పదు. లేదా.. ట్రాన్స్‌ఫర్ టూ టీవీ!
అయితే ఈ కుర్రాడి విషయంలో జరిగింది వేరు.
ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఈ కుర్రాడు 9 సినిమాలు హీరోగా చేశాడు. ప్రత్యేక సహాయ పాత్రల్లో మరో 3 సినిమాలు చేశాడు. అన్నీ రిలీజయ్యాయి. రావల్సిన హిట్ మాత్రం ఇంకా రాలేదు.
అయినా ఎనర్జీ తగ్గలేదు. ఎయిమ్ మారలేదు.
అతనే అఖిల్ కార్తీక్.
కట్ టూ అఖిల్ కార్తీక్ ఎంట్రీ -
వైజాగ్ సత్యానంద్ ఇన్స్‌టిట్యూట్ నుంచి నేరుగా మొదటిసారిగా హైద్రాబాద్ వచ్చాడు కార్తీక్. ఏ రోడ్డూ, ఏ ఏరియా తెలియదు. ఎవరు ఎక్కడుంటారో తెలియదు.
తెలిసింది ఒక్కటే. ఎలాగయినా హీరో కావాలి.
తెచ్చుకున్న కొంచెం డబ్బుతో పంజాగుట్టలో ఉన్న ఒక చిన్న హోటల్లో దిగిపోయాడు కార్తీక్. ఇప్పటికీ అక్కడే ఉన్న ఆ హోటల్ పేరు - బాలాజీ లాడ్జ్.
అప్పట్లో ఒక ప్రముఖ దర్శకుని పిలుపుతో అలా హైద్రాబాద్‌కు వచ్చిన తర్వాత కార్తీక్‌కు కథ అడ్డం తిరిగింది. ఏదో ఒక సంవత్సరం కదా అని బాండ్ అగ్రిమెంట్‌కు ఓకే చెప్తే, ఆ ప్రముఖ దర్శకుడు దాన్ని చివరి నిమిషంలో ఐదేళ్లకు పెంచాడు!
ఆలోచించాడు కార్తీక్. సింపుల్‌గా "నో" అనుకున్నాడు.
తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్న టైమ్‌లో పంజాగుట్ట హోటల్ నుంచి మకాం మధురానగర్ గల్లీలోని బ్యాచ్‌లర్ రూమ్‌లోకి మారింది.
అప్పుడొచ్చిందొక అవకాశం.
ముప్పలనేని శివ కొత్తవాళ్లతో తీస్తున్న చిత్రం ఆడిషన్స్‌లో అదరగొట్టాడు కార్తీక్.
అంతే.
తన సినిమాలోని ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా ఎన్నిక చేశారు ముప్పలనేని శివ. ఆ తర్వాత అక్కడకూడా ఎన్నో ట్విస్టులు తట్టుకొని, చివరికి ముప్పలనేని శివ దర్శకత్వంలోనే హీరోగా నటించాడు కార్తీక్.
అలా తొలిసారిగా కార్తీక్ హీరోగా నటించిన ఆ చిత్రం పేరు "దోస్త్!"
2004 నుంచి 2014 వరకు పదేళ్లు గడిచినా, కార్తీక్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులేదు. అనవసరపు చెత్త సినిమాటిక్ మాస్కులు లేవు. నా రెండో చిత్రం "అలా"లో నటించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు కార్తీక్.
అదే అతని ఎసెట్. అదే అతనికి శ్రీరామ రక్ష.
జస్ట్ ఎ గుడ్ గై.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
ఆనాటి "దోస్త్" నుంచి, మొన్నటి "తీయని కలవో" వరకు - 9 చిత్రాల్లో హీరోగా చేసినా, తనకు రావల్సిన రేంజ్‌లో ఒక హిట్ ఇంకా కార్తీక్ ఖాతాలో పడలేదు.
అయితే 2015 వస్తోంది మాత్రం ఆ లోటు తీర్చడానికే. అదెలాగో వివరంగా చెప్పటం అవసరమని నేననుకోవటం లేదు.
ఇట్ జట్ హాపెన్స్ ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani