"ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది కొంచెం స్టయిలిష్‌గా చెప్పేమాట. "ఒక ఐడియా ఏకంగా కొంపలు ముంచుతుంది" అన్నది ముఖం మీద గుద్దినట్టు చెప్పేమాట.
మొదటిది పాజిటివ్ భావన. రెండోది పక్కా నెగెటివ్ ఎఫెక్టు. రెండూ అనుభవపూర్వకంగా తెలిసేవే.
ఈ రెండు రకాల ఐడియాల ప్రభావాన్ని వివిధ దశల్లో వ్యక్తిగతంగా చవిచూసినవాణ్ణి కాబట్టి నాలో ఒకరకమైన స్థితప్రజ్ఞత క్రమంగా అలవడింది.
థాంక్స్ టూ మై ఐడియాస్. గుడ్ ఆర్ బ్యాడ్. బెటర్ ఆర్ వరస్ట్ ..
కట్ టూ మై లేటెస్ట్ ఐడియా -
ప్రస్తుతం నేను చేస్తున్న తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా కోసం ఒక టైటిల్ అనుకున్నాము. అయితే అఫీషియల్‌గా ఆ టైటిల్ మాకు రావడానికి ఇంకో రెండు వారాలు పడుతోంది. అంతదాకా నో ప్రెస్‌మీట్! అవసరమయితే ప్రెస్‌నోట్ ఒకటి మాత్రం రిలీజ్ చేస్తాం.
సినిమా షూటింగ్ అయిపోయిందనీ, ప్లస్ ఇంకా కొన్ని విశేషాలతో.
ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ యమ ఫాస్ట్‌గా చేస్తూనే - ఈ సినిమా అనుకున్న రోజునుంచి ఇప్పటివరకూ, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ వరకూ .. అన్ని విశేషాలతో, రోజూ కనీసం ఓ 15 నిమిషాలు కెటాయించి బ్లాగింగ్ చేయాలనుకుంటున్నాను.
ఇది మాత్రం చెత్త ఐడియా కాదని నా నమ్మకం. ఏమో .. ఈ బ్లాగ్ పోస్టులతోనే రేపు "ది మేకింగ్ ఆఫ్ .." అని ఓ పుస్తకం కూడా పబ్లిష్ చేయొచ్చు! ఎవరికి తెలుసు ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani