"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు."
ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే!
ఎలా కాదనగలం?
సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. ఆ సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు.
విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం.
అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్నపని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, దానిమీదే దృష్టిపెట్టి ఆ పనిని పూర్తి చేసెయ్యటం.
కట్ టూ మన ఫాక్టరీ -
సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అంత తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు ఎవరయినా సినిమా తీయొచ్చు. అంతా కొత్తవాళ్లతో, నేచురల్ లొకేషన్లలో సినిమా తీస్తే - దాదాపు అది "నో బడ్జెట్" సినిమానే! కొంచెం పేరున్న హీరో హీరోయిన్లయినా సరే, ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అంత సౌకర్యం కల్పిస్తోంది.
ఇటీవలి కాలంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ కమర్షియల్ సినిమాలు, థ్రిల్లర్‌లు ఈ విషయాన్ని నిరూపించాయి. పుష్కలంగా డబ్బుల వర్షం కురిపించాయి.
కేవలం బడ్జెట్ దృష్టితో చూస్తే, వీటిని కమర్షియల్ ఆర్ట్ సినిమాలనవచ్చేమో! లేటెస్ట్ ఆన్‌లైన్ ప్రమోషన్ టెక్నిక్స్‌తో ఒక ఆట ఆడుకోవచ్చు. కావల్సినంత హల్‌చల్ క్రియేట్ చేయొచ్చు. ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా, వీటి కలెక్షన్ ఇంచుమించు పెద్ద సినిమాలకు పోటీగా ఉంటుంది. ఈ రేంజ్ బడ్జెట్ లో అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇంకేం కావాలి?
ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న తాజా సినిమా ఇలాంటిదే.
యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్!
నాలుగయిదు రోజుల్లో పూర్తి వివరాలు ప్రెస్‌లో రానున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో హీరోయిన్లే లీడ్ పాత్రలు వేస్తున్నారు. ఒక పక్కా కమర్షియల్ సినిమా. కౌంట్‌డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్టోబర్ చివరినుంచి సింగిల్ షెడ్యూల్ షూటింగ్.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగానే మరో సినిమా. ఆ ఏర్పాట్లు కూడా మరోవైపు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
సో, ఇగ మన ఫాక్టరీ షురూ అన్నమాట ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani