మొన్నొక ఈగోసెంట్రిక్ జీవి తన మొబైల్‌లో ఉన్న వాట్సాప్, వైబర్, విచాట్, స్కైప్ లాంటి నానా చెత్తంతా చూపిస్తూ చాలా గొప్పగా ఫీలయిపోయాడు. నిజంగా జాలిపడ్డాను అతని మీద.
సమయం విలువ తెలిసినవాడెవ్వడూ ఇలా వెబ్‌లో దొరుకుతున్న ప్రతిదాన్నీ సిస్టమ్‌లోకి, మొబైల్‌లోకీ ఎక్కించుకోడు. తనకి వాటిలో నిజంగా ఏది అవసరమో దాన్నే తీసుకుంటాడు. ఉపయోగిస్తాడు.
కట్ టూ నాణేనికి మరోవైపు -
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను మొన్నటిదాకా అందరూ ఏదో టైమ్‌పాస్ అనుకొనేవారు. ఇప్పటికీ చాలా మంది అనుకొనేది అదే. కానీ ఇప్పుడీ రెండింటి వాడకంలో పరిస్థితి చాలా మారింది.
వీటి విలువ తెలుసుకున్న వాళ్లు.. కుర్రాళ్ల నుంచి ముసలాళ్ల దాకా.. దాదాపు చాలామంది, వీటిని ఏదో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కూడా వాడటం అలవాటు చేసుకుంటున్నారు.
ఇది నిజంగా ఓ గొప్ప పాజిటివ్ మార్పు.
ఆ ప్రయోజనం మానసిక ప్రశాంతత కావొచ్చు. ఒంటరితనం పోగొట్టుకోవడం కావొచ్చు. బిజినెస్ డెవలప్‌మెంట్ కావొచ్చు. పొలిటికల్ ప్రమోషన్ కావొచ్చు. ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కావొచ్చు. మరేదయినా బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ కోసం కావొచ్చు. అది లవ్, రొమాన్స్ అయినా సరే .. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల వాడకంలో ఒక పరిణతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
తాజా ట్రెండ్ ఏంటంటే - ఢిల్లీ నుంచి గల్లీ దాకా, దాదాపు ప్రతి చిన్నా పెద్దా పొలిటీషియన్లు కూడా ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు వాడటం ప్రారంభించారు!
లేటెస్టుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సి ఎం ఓ కూడా అఫీషియల్‌గా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల వాడకం ప్రారంభించింది.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే - డైరెక్టుగా మన ఐ టి మిస్టర్‌కి ఒకే ఒక్క ట్వీట్ ఇవ్వటం ద్వారా సైనా నెహ్వాల్ ఏళ్లతరబడిగా గవర్నమెంట్ దగ్గర నానుతున్న తన ఫైల్‌కు కదలిక తెచ్చుకోగలిగింది!
సోషల్ మీడియా ఎంత అద్భుతం!
అయితే.. సైనా సెహ్వాల్ ఒక సెలబ్రిటీ ప్లేయర్. వెంటనే పని జరిగింది. పెండింగ్‌లో ఉన్న ఒక 70 ఏళ్ల వృధ్ధురాలి పెన్షన్ ఫైల్ గురించి ట్వీట్ చేసినా ఇదే వేగం ఉండితీరాలి. అలాంటి సిస్టమ్ రూపకల్పన కూడా జరగాలి.
ఆ దిశలో కూడా పని ప్రారంభమైందని తెలిసింది.
జయహో ఫేస్‌బుక్, ట్విట్టర్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani