సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
అయిదు రోజుల ఆటయినా .. ఇంతకు ముందు టెస్ట్ క్రికెట్ అంటే అదో క్రేజ్. తర్వాత కొంతకాలం వన్ డే లు రాజ్యమేలాయి. అటో ఇటో ఒక్క రోజులోనే ఫైసలా అన్నమాట.
ఇప్పుడు ఉన్నట్టుండి 20-20 ఎంటరయ్యింది. అసలు ఆటే మారిపోయింది!
ఒక్క క్రికెట్ లోనే కాదు. ఈ వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది. మనిషి జీవితం లోనూ వచ్చింది. అలా వచ్చేలా చేసింది ఇప్పటి మన ఆధునిక జీవనశైలి.
అసలు ఇప్పుడు ఎవరయినా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? మొబైల్స్ కూడా దాదాపు అందరూ టచ్ స్క్రీన్ లనే ఇష్టపడుతున్నారు. ఎందుకు?
టైం లేదు. వేగం. ఇంకేదో కొత్తది కావాలన్న తపన.
కట్ టూ 20-20 సినిమా -
ఒకప్పుడు సినిమా తీయడం అంటే అదొక మహా యజ్ఞం. షూటింగ్ చూడటం ఓ గొప్ప విషయం. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు కనిపించినా అదో సంచలనం.
ఇప్పుడవన్నీ మటాష్!
రాజమౌళి లాంటి కొందరు జక్కన్నలను వదిలేయండి. ఆర్ట్ సినిమాల రూపశిల్పులనూ వదిలేయండి. వీరి సంఖ్య కూడా చాలా చాలా తగ్గిపోయింది. అది మరో టాపిక్. ఇప్పటికి అలా వదిలేద్దాం.
మళ్ళీ మన 20-20 పాయింట్ కు వద్దాం.
ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా, ప్రతి వారం ఏదో ఓ కొత్త సంచలనం ప్రపంచంలో ఏదో ఓ మూల చూస్తున్నాం. స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లో సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నాం కూడా.
సినిమాని అనౌన్స్ చేసిన రోజే దాని రిలీజ్ తేదీ కూడా చెప్పేస్తున్నారు. ఉత్తి టైటిల్, పోస్టర్ తోనే ప్రమోషన్, మార్కెటింగ్, బిజినెస్ .. అన్నీ చేసేస్తున్నారు.
కొన్ని లక్షలు ఉంటే చాలు. ఇప్పుడు ఎవరయినా సినిమా తీయొచ్చు.
ఇదొక క్రియేటివ్ బిజినెస్. ఇంతకూ ముందులాగా ఇదేం "హెవీ గాంబ్లింగ్" కాదు. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు.
"100 డేస్" రోజులు పోయాయి. మొదటివారం నిలబడి రెండోవారంలోకి ఒక సినిమా ఎంటర్ అయిందంటే చాలు. నిర్మాత ఇంకో పెద్ద సినిమాకి హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. ఆట ముఖ్యం. ఆటలో ఉండటం ముఖ్యం. ఆటలో మజా ముఖ్యం. డబ్బు రకరకాల రూపాల్లో అదే మనల్ని ఫాలో అవుతుంది. ఎవరికీ నష్టం ఉండదు. ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్!
మా ప్రొడక్షన్ కంపెనీ మనుటైం ఫిలిం అకాడమీ కూడా ఒక సిరీస్ అఫ్ మైక్రో బడ్జెట్ ఫిలిమ్స్ తో ఈ ట్వంటీ ట్వంటీ కి సిద్ధమవుతోంది. అతి త్వరలో ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani