సినిమాల్లో మనం ఏం సంపాదించినా, ఎంత మనీ రొటేషన్ చేసినా హార్డ్‌లీ ఇంకో ఏడాదిన్నరే! ఆ తర్వాతంతా.. అయితే జాక్‌పాట్.. లేదంటే, బ్యాంక్‌రప్ట్. మరో మధ్యేమార్గం ఉండదు.
ఈ మధ్య నేను అందరితోనూ ఇదే విషయం చెప్తున్నాను. సో, సినిమా ప్రొఫెషన్లో మనం ఏం సంపాదించుకున్నా (పోగొట్టుకున్నా) ఇంకో ఏడాది, ఏడాదిన్నరే అన్నమాట!
నిజంగా అంతే. అంతకంటే ఎక్కువ సమయం లేదంటే లేదు.
అంతా డిజిటలైజ్ అయిపోయి.. సినిమా నిర్మాణం, పధ్ధతి సమూలంగా మారిపోయాయి. ఏవో కొన్ని భారీ స్టార్‌కాస్టింగ్‌తో కూడిన భారీ చిత్రాలకోసం తప్ప.. ఇంకొన్నాళ్ల తర్వాత ఎవ్వరూ థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడరు. అలా చూడలేని పరిస్థితులు మన జీవనశైలిలో వస్తాయి.
ఇంకోవిధంగా చెప్పాలంటే - టెక్నాలజీ మన జీవనశైలిని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికిప్పుడు మనం ఊహించనంతగా ప్రభావితం చేస్తుంది.
అయితే - కొన్ని మైక్రో బడ్జెట్ సినిమాలు కూడా భారీ చిత్రాల స్థాయిలో విజయాలు సాధించే అవకాశాలు పెరిగిపోతుంటాయి. సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేయగల కంటెంట్‌కు మాత్రమే ఈ శక్తి ఉంటుంది.
సమస్యల్లా ఒక్కటే. ఇలాంటి మైక్రో బడ్జెట్ చిత్రాలకు బడ్జెట్, ఇతర వనరులు చాలా తక్కువగా ఉంటాయి. లేదా పెద్ద చిత్రాలతో పోలిస్తే అసలేమీ ఉండవు!
కట్ టూ డీటీహెచ్ ఎట్‌సెటెరా -
కొద్దినెలలే. రోజులే. అంతా ఇక డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) పధ్ధతిలోగానీ, మరోరకంగా గానీ ఆన్‌లైన్లో టికెట్లు కొనుక్కొని డౌన్‌లోడ్ చేసుకొనిగానీ సినిమాలు చూస్తారు. ఇకముందంతా జరగబోయేది ఇదే.
ఆ మధ్య కమలహాసన్ తన "విశ్వరూపం" సినిమాను ఈ పధ్ధతిలో విడుదలచేయడానికి ప్రయత్నిస్తే ఓ నానా గొడవలు, రాజకీయాలు చేశారు. కానీ, ఆధునికంగా వస్తున్న సాంకేతిక అభివృధ్ధిని ఆపడం ఎవరివల్లా కాని పని అని ఇంకొంత కాలానికైనా మన సోకాల్డ్ అషాఢభూతులు ఒప్పుకొని తలవంచకతప్పదు!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani