1. అదేపనిగా చూస్తున్న టీవీని ఆఫ్ చేసి, పీకలమీదున్న పనుల గురించి ఆలోచించవచ్చు. వాటిని పూర్తిచేసే దిశలో ఆచరణ కూడా ప్రారంభించవచ్చు.
2. ఇంట్లో పనికిరాని చెత్తా చెదారం ఎంతో ఉంటుంది. దాన్లో కనీసం ఒక చిన్న భాగాన్నయినా "వీడ్ అవుట్" చేసేసి, బయట డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు. ఇలా వారానికి ఒకసారి చేసినా ఇల్లు నీట్‌గా ఉంటుంది.
3. మీ పిల్లల స్కూలు డైరీల్లో కొన్ని పేజీలయినా చూడొచ్చు. ఏవయినా సంతకాలు చేయాల్సింది మిగిలి ఉంటే చేసేయొచ్చు.
4. ఎప్పుడూ అలా నాలుగు గోడల మధ్యే కూర్చోకుండా - కాసేపు అలా బయటకెళ్లి ఫ్రెష్ ఎయిర్లో 'వాక్' చేసి రావొచ్చు. అంత ఓపిక లేకపోతే - కనీసం ఇంట్లో ఓ మూలన కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చోవచ్చు.
5. ఎడతెగని ఎస్ఎమ్ఎస్‌లు, కాల్స్, వాట్సాప్‌లు, వీడియో గేమ్‌స్ ల మొబైల్ ఫోన్‌ని ఒక 9 నిమిషాలు స్విచాఫ్ చేసి ఊపిరిపీల్చుకోవచ్చు.
6. రొటీన్‌కు భిన్నంగా - మీ జీవిత భాగస్వామికి ఓ కప్పు కాఫీ చేసి ఇవ్వొచ్చు. లేదా చేయించుకొని త్రాగొచ్చు. (ఏది రొటీనో మీకే తెలుసు!)
7. ఫేస్‌బుక్‌లో ఊరికే (నాలాగా) ప్రతి చెత్తా పోస్ట్ చేయడం ఆపి, అద్దంలో ఓసారి ఫేస్ చూస్కోవచ్చు! 'అసలేంటి నువ్వు.. నీ జీవితంలో ఏం జరుగుతోంది?' అని.
8. ఓ ఆరు నెలలుగా కనీసం పలకరించుకోని మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరికయినా ఒక కాల్ చేయొచ్చు.
9. ఇదుగో.. ఇలా ఓ చిన్న బ్లాగ్ పోస్ట్ కూడా రాయొచ్చు. పనికిరాని ఎన్నో చెత్త పనులకంటే, రాయడం కోసం ఇలా ఓ తొమ్మిది నిమిషాలు వెచ్చించడం నేరం ఏమీ కాదు. రాయడం కూడా ఓ విధమైన మెడిటేషనే!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani