నేను వాలెంటైన్స్ డే గురించి మాట్లాడబోవటం లేదు. నిజానికది వాలెంటైన్స్ డే కాదు. ఒక వేస్ట్ డే.
నిజమైన ప్రేమికులకు 365 రోజులూ వాలెంటైన్స్ డేనే అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది కేవలం ప్రేమికులకే కాదు. ప్రేమికుల్లా జీవించే, జీవించాలనుకొనే భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్ వగైరా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ఒక ప్రచారం ఎక్కువగా జరిగింది మొన్నటి 14 ఫిబ్రవరి నాడు. మన దేశ స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మకంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను సుమారు 83 ఏళ్ల క్రితం, 1931 లో, ఇదే రోజు లాహోర్‌లో బ్రిటిష్‌వాళ్లు ఉరితీశారని! కానీ అది నిజం కాదు.
1931 లో, 14 ఫిబ్రవరి నాడు అప్పటి కాంగ్రెస్ ప్రసిడెంట్ మదన్ మోహన్ మాలవీయ ఈ దేశభక్తుల మరణ శిక్షను రద్దుచేయమని అభ్యర్థిస్తూ ఒక మెర్సీ అప్పీల్‌ను లార్డ్ ఇర్విన్ కు సమర్పించాడు. కానీ అది నెరవేరలేదు. ఆ తర్వాత మార్చి 23 నాడు ఈ ముగ్గురినీ ఉరితీయడం జరిగింది.
పోన్లెండి .. ఇదెలా క్రియేట్ అయ్యిందో తెలీదు కాని, మొత్తానికి ఈ వాలెంటైన్స్ డే పుణ్యమా అని .. మనవాళ్లు భగత్ సింగ్‌ను, అతని అనుచరులను కనీసం గుర్తుకు తెచ్చుకున్నారు!
కట్ టూ వ్యక్తిగతం -
ఈ ఫిబ్రవరి 14 ను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒక 6 నెలల తర్వాత నేను ప్రారంభించాలనుకొన్న పనుల్ని ఆ రోజునుంచే ప్రారంభించేలా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. ప్రారంభించాను.
అలాంటి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆ రోజు సృష్టించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలను?
ఆ విధంగా చూస్తే.. ఫిబ్రవరి 14 అనేది నాకు ఎన్నటికీ అత్యంత ప్రియమైన రోజే!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani