"ఆల్ టైమ్ టాప్ 100 ఇండియన్ మూవీస్" లో అక్కినేని నటించిన "దేవదాసు" ఉంది. దానికా అర్హత ఉంది. ఇంకెంతకాలం తర్వాతయినా ఈ 100 అత్యుత్తమ భారతీయ చిత్రాల లిస్టులోంచి 1953 లో తీసిన ఈ దేవదాసు చిత్రాన్ని తొలగించే పరిస్థితి రాదు. తొలగించలేరు.
కళాత్మకంగా చూసినా, ఫక్తు సినిమాపరంగా చూసినా ఎన్నెన్నో కోణాల్లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ఒక క్లాసిక్.
బెంగాలీ రచయిత శరత్ నవల "దేవదాస్" మూలకథను ఒక అద్భుత ప్రేమకథాకావ్యంగా మలచి, చరిత్రలో నిల్చిపోయేట్టు చేసిన మహామహులెందరో ఆ చిత్రానికి పనిచేసిన టీమ్‌లో ఉన్నారు.
ఒక డైరెక్టర్‌గా, ఆ టీమ్ అంతటికీ కెప్టెన్ వేదాంతం రాఘవయ్య. అయితే, ఆ కెప్టెన్ కలను నిజం చేసిన వ్యక్తులు మాత్రం ప్రధానగా ముగ్గురు.
ఒకరు ఘంటసాల. కాగా.. దేవదాసుగా నటించిన అక్కినేని, పార్వతిగా నటించిన సావిత్రి మిగిలిన ఇద్దరు.
దేవదాసు చిత్రాన్ని అప్పట్లోనే హిందీలో దిలీప్ కుమార్ హీరోగా తీశారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ హీరోగా కూడా అత్యంత భారీగా తీశారు. ఇంకా బెంగాలీ, అస్సామీ, ఉర్దూల్లో కూడా దేవదాసు చిత్రాన్ని నిర్మించారు. మన తెలుగులోనే, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయనిర్మల కూడా 1974 లో దేవదాసు తీశారు.
అప్పట్లో హీరో కృష్ణ దేవదాసుగా చేసిన దేవదాసు చిత్రాన్ని అందరూ "కొత్త దేవదాసు" అనేవాళ్లు. అది వేరే విషయం.
సందేహం లేదు. ప్రతి ఒక్కరూ అక్కినేని దేవదాసు కంటే అద్భుతంగా తీయడానికే ప్రయత్నించారు. కానీ.. అక్కినేని దేవదాసును వరించినంత విజయం గానీ, పేరుగానీ ఏ ఒక్క చిత్రానికీ రాలేదు. రాదు కూడా.
ఇకముందు రాబోయే ఎన్ని దేవదాసులకయినా ఇదే వర్తిస్తుందని నా అభిప్రాయం.
కారణం చాలా స్పష్టం. కొత్తగా తీసిన/తీసే దేవదాసుల్లో కొత్త హంగులు, రంగులు, కొత్త టెక్నాలజీ, భారీతనం.. ఇంకా ఏవేవో ఉండవచ్చు. కానీ, ఆ దేవదాసులోని 'లైఫ్' వీటిలో ఉండదు.
విజయనిర్మల కూడా తన దేవదాసుతో ప్రేక్షకులకు ఒక "విజువల్ ట్రీట్"ని ఇచ్చారు. కానీ, అది హృదయాన్ని తాకలేకపోయింది.
కట్ టూ 'సుమంత్' దేవదాసు -
ఇప్పుడు మళ్లీ.. అక్కినేని మనవడు సుమంత్‌కు తనే హీరోగా దేవదాసును మళ్లీ తీయాలన్న కోరిక పుట్టింది. తప్పేంలేదు. ఒక ఆర్టిస్టుగా తన కలను నిజం చేసుకోడానికి ప్రయత్నించే స్వాతంత్ర్యం ఆయనకుంది. దాన్ని ఎవ్వరూ కాదనడానికి వీళ్లేదు.
వాస్తవానికి సుమంత్‌లో ఈ కోరిక పుట్టడానికి కారణం కూడా దేవదాసులో అద్భుతంగా నటించి, ఆయనమీద అంత చెరగని ముద్ర వేసిన తాతయ్య అక్కినేనే అని చెప్పవచ్చు.
ఇటీవలే దివంగతులైన తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ప్రేమతో సుమంత్‌కు ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు. చాలా సహజమైన విషయం. సుమంత్ తను అనుకున్నది చేసి తీరాల్సిందే. అలా చేసి, స్వర్గంలో ఉన్న తన తాతగారికి సంతోషం కలిగించాల్సిందే.
కాకపోతే సుమంత్ చేయబోయే దేవదాసుని.. తన తాతయ్య బ్రతికుంటే.. దాన్ని చూసి, "శభాష్!" అని మెచ్చేలా ఉండాలి. అంతే తప్ప, అదేదో ఆ మధ్య మన ఆర్‌జీవీ "షోలే" ను "ఆగ్" చేసినట్లు కాకూడదన్నది నా కోరిక.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani