పొద్దుటే "ఈనాడు" సినిమా పేజ్‌లో నాగార్జున ఇంటర్వ్యూ చదివాను. బావుంది.
టీవీ ఇంటర్వ్యూల్లో, ఫంక్షన్‌లలో స్టేజ్‌మీద నాగార్జున కూర్చునే పధ్ధతిలో, మాట్లాడే స్టయిల్లో కొంత "ఈగో" కనిపించవచ్చు. నా దృష్టిలో అదో మామూలు విషయం. "నాక్కొంచెం ఈగో ఎక్కువ" అని స్వయంగా నాగార్జునే ఏదో ఇంటర్వ్యూలో అన్నట్టు కూడా నాకింకా గుర్తుంది.
ఒక నిజం ఏంటంటే.. నాగ్ మాటల్లో (చాలా మంది హీరోల్లా) ఎలాంటి హిపోక్రసీ ఉండదు. ఎలాంటి పనికిరాని "మాస్క్"లుండవు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాడు.
ఇవాళ నేను చదివిన నాగ్ ఇంటర్వ్యూలో నన్ను బాగా ఆకట్టుకున్న పాయింట్స్ మూడు..
పాయింట్ వన్:
నాగ్ వాళ్ల నాన్నగారయిన "లెజెండ్" అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ మధ్య ఎక్కువ సమయం గడుపుతుండటం. "గత అయిదారేళ్లలో ఎంతసేపు ఉన్నానో, దానికి మించి ఈ రెండు మూడు నెలల్లో నాన్నతో ఉన్నాను" అన్నాడు నాగ్.
పాయింట్ టూ:
తను నిర్మించి నటించిన "భాయ్" సినిమా వైఫల్యం గురించి నిర్మొహమాటంగా.. " ఆ సినిమావల్ల నామీద నాకే గౌరవం పోయింది" అన్నాడు.
కట్ టూ లాస్ట్ బట్ మెయిన్ పాయింట్ -
ప్రస్తుతం మనదగ్గర.. "అయితే మల్టీప్లెక్స్ సినిమాలు, లేదంటే వాణిజ్యపరమైన సినిమాలు" (రెగ్యులర్ మాస్ మసాలా/కమర్షియల్) మాత్రమే వస్తున్నాయన్నాడు నాగ్. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం.
మల్టీప్లెక్స్ సినిమాల్లో యూత్‌ని టార్గెట్ చేసుకొని తీసినవే ఎక్కువగా వస్తాయి. ఇది సహజం. ఎందుకంటే, ఇప్పుడు అసలు సినిమాలు ఎక్కువగా చూస్తున్నదీ, మల్టీప్లెక్స్ కల్చర్‌కు ఎడిక్ట్ అయిపోయిందీ వాళ్లే కాబట్టి.
ఇక కమర్షియల్ అంటే భారీ బడ్జెట్లు తప్పవు. భారీ హీరోలూ, హీరోయిన్లూ, మాంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఇవి పరిమితం.
30, 40 కోట్లు పెట్టి భారీ హీరోలతో సినిమాలు చేయడమన్నది అందరికీ ప్రాక్టికల్‌గా సాధ్యం కాని పని. ఈ రేంజ్ సినిమాల కోసం క్యూ కనీసం ఇంకో రెండేళ్లదాకా ఉంటుంది. మనం ఎంత డబ్బు కుమ్మరిద్దామన్నా.. వాళ్ల లాబీలు దాటి బయటికి రారు హీరోలు. దర్శకుడు అప్పుడే ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చివుంటే తప్ప!
ఇక మిగిలింది.. "మల్టీప్లెక్స్ సినిమాలు" అనబడే ట్రెండీ యూత్ సినిమాలు..
వీటిని నిర్మించడం కోసం "స్టార్" హీరోలు, హీరోయిన్లు అవసరంలేదు. అందరూ సొదపెట్టే "ప్యాడింగ్" అంతకంటే అవసరం లేదు. కొత్త నటీనటులు, అప్ కమింగ్ నటీనటులు చాలు. బడ్జెట్లు కూడా కోట్లు అవసరం లేదు. కొన్ని లక్షలు చాలు.
సినీ నిర్మాణంలో వచ్చిన ఆధునిక కెమెరాలను, టెక్నాలజీని ఉపయోగించి.. అతి తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఎవరయినా ఎన్నయినా సినిమాలను తీయవచ్చు.
కావల్సిందల్లా ఒక్కటే..
కథ పాతదయినా, కొత్తదయినా.. దాన్ని సరికొత్తగా చెప్పగలగటం. అదీ యూత్‌కి నచ్చేలా, వారిని వారు ఐడెంటిఫై చేసుకునేలా చెప్పగలగటం. వారిని ఆకట్టుకోవటం.
ఇది సాధించిన ఏ దర్శకుడయినా ఉన్నట్టుండి హీరో అయిపోతాడు. ఆ తర్వాత ఓ దశాబ్దంపాటు ఈజీగా ఇండస్ట్రీలో ఉండగలుగుతాడు.
అయితే - ఇది చెప్పినంత సులభం కాదు. దీని వెనక ఎన్నో "చెప్పుకోలేని" తలనొప్పులూ, తిప్పళ్లూ ఉంటాయి. వీటిని అధిగమించాలంటే ఒక లైక్‌మైండెడ్ టీమ్ (ప్రొడ్యూసర్‌తో కలిపి) అవసరం.
అలాంటి ఒక టీమ్‌ని తయారుచేసుకొని, ఈ తలనొప్పులన్నిటినీ అధిగమించి.. ఒక నిజమైన "హిట్" సినిమాను ఇవ్వగలిగిననాడు.. మనం పొందే ఆ మజానే వేరు. ఆ కిక్కే వేరు.
ఏమంటారు?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani