అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు... ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.
వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.
ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను "Land of Broken Dreams" అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు.
కట్ టూ మన టాలీవుడ్ -
పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.
మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.
సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే. ఇకముందు కూడా అంతే.
ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.
ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా, ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ... కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక 20 మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు.
మిగిలినవాళ్లంతా స్ట్రగుల్ అవుతూ ఉండాల్సిందే... ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.
ఇండస్ట్రీ మంచిదే. కానీ, దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.
ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి. వాటిల్లో ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani