ఆడియో పాడ్‌కాస్టా, వీడియోనా అని అని దాదాపు సంవత్సరం నుంచి - గుర్తొచ్చినప్పుడల్లా అనుకొంటూ - ఒకసారి ఇదనీ ఒకసారి అదనీ - ఎటూ తేల్చుకోలేక, గత కొద్ది నెలలుగా, అసలావైపు ఆలోచించడం మానేశాను.
చివరికి... ఇప్పుడొక నిర్ణయానికొచ్చాను.
కట్ చేస్తే -
మనవాళ్ళు ఇంకా ఆడియో పాడ్‌కాస్ట్‌లకు అంతగా అలవాటుపడలేదు. యూట్యూబ్ వీడియోలకే అత్యధికశాతం మంది అంకితమయ్యారు.
మనదేశంలో కూడా వేళ్లమీద లెక్కించగలిగినంతమంది పాపులర్ పాడ్‌కాస్టర్స్ ఉన్నారు. తెలుగులో కూడా ఉన్నారు. కాని, అభివృద్ధిచెందిన పాశ్చాత్యదేశాల్లో పాపులర్ అయినంతగా ఇక్కడ మనదేశంలో పాడ్‌కాస్ట్ ప్రాచుర్యం కాలేదు.
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 'ప్రోగ్రెస్' అనేది పశ్చిమ దేశాల్లో ఒక జీవనవిధానం. వాళ్ళు వాకింగ్ చేస్తున్న సమయంలో, డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా ఆడియో బుక్స్, ఆడియో ప్రోగ్రామ్స్, పాడ్‌కాస్ట్‌లు వింటుంటారు. పాడ్‌కాస్ట్‌లు రోజూ మిలియన్స్‌లో డౌన్‌లోడ్ అవుతుంటాయి.
మనం ఇంకా అక్కడిదాకా రాలేదు.

అయితే - ఆడియో పాడ్‌కాస్ట్‌లకు ఎడిక్టయ్యే రోజు ఇక్కడ కూడా తప్పక వస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం కొంచెం లేటు... అంతే.
మార్కెటింగ్ పరంగా ఒక్క నిజం మాత్రం ఒప్పుకొని తీరాలి. ఏంటంటే - వీడియోలు చూపినంత ప్రభావం మార్కెటింగ్ విషయంలో ఆడియోలు చూపలేవు. ఎఫ్ ఎం రేడియోల్లాంటివి కొంతవరకు ప్రభావం చూపిస్తున్నా... అవి వీడియోలకు పోటీ కావు.
ముఖ్యంగా... బ్రాండింగ్ విషయంలో పాడ్‌కాస్ట్ ప్రభావం మరీ స్లో.
కాని, దీనికున్న అడ్వాంటేజెస్ దీనికున్నాయి.
కాని, దీనికున్న అడ్వాంటేజెస్ దీనికున్నాయి.
ఇలాంటి ఆలోచనల మధ్య - నేను ఏదో ఒకటి త్వరగా ప్రారంభించాలనుకొంటున్నాను.
వ్యక్తిగతంగా, మార్కెటింగ్ పరంగా ఇప్పుడు నాకీ అవసరం ఉంది.
అయితే - ఏది ప్రారంభించినా అది 100% నేనే చేసుకోవాలి. ఎడిటింగ్, డిజైనింగ్, ఇతర టెక్నికల్ విషయాల కోసం ఇంకొకరి మీద నేను ఆధారపడకూడదు. నా సమయం వృధా కాకూడదు.
రాత్రే ఈ విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చేశాను. త్వరలోనే ప్రారంభిస్తున్నాను...
అది పాడ్‌కాస్టా, వీడియోలా అన్నది కొద్దిరోజుల్లో మీరే చూస్తారు.
అది పాడ్‌కాస్టా, వీడియోలా అన్నది కొద్దిరోజుల్లో మీరే చూస్తారు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani