నా తొలిచిత్రం "కల" లో పూర్తిస్థాయి విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మంచి నటుడు అమిత్ కుమార్.
ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ అప్పుడు "సూపర్ హిట్", "సంతోషం", "టైమ్స్ ఆఫ్ ఇండియా"ల్లో ఇచ్చిన మా ప్రకటనలకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది.
జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఉన్న మా ఆఫీసుకి సగటున రోజుకి ఓ వందమందికి పైనే ఆర్టిస్టులు వచ్చేవారు, ఆడిషన్‌కి.
జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఉన్న మా ఆఫీసుకి సగటున రోజుకి ఓ వందమందికి పైనే ఆర్టిస్టులు వచ్చేవారు, ఆడిషన్‌కి.
చాలామంది ఫోటోలు ఇచ్చి వెళ్లేవాళ్ళు.
అలా ఎంటరయిన వాడే అమిత్ కుమార్. ఇప్పుడు అమిత్ తివారి.
ముంబైలో పుట్టి పెరిగిన అమిత్ తెలుగువాడే.
ఒకరోజు ఉదయం అఫీస్‌లో నా టేబుల్ మీద అమిత్ ఫోటోల్ని చూశాను. వాటిల్లో ఒక ఫోటో చూడగానే ఇంక అతనే "కల విలన్" అని డిసైడయిపోయాను. వెంటనే పిలిపించాను. ఆడిషన్, సెలక్షన్, అగ్రిమెంట్లు చకచకా జరిగిపోయాయి.
ఒకరోజు ఉదయం అఫీస్‌లో నా టేబుల్ మీద అమిత్ ఫోటోల్ని చూశాను. వాటిల్లో ఒక ఫోటో చూడగానే ఇంక అతనే "కల విలన్" అని డిసైడయిపోయాను. వెంటనే పిలిపించాను. ఆడిషన్, సెలక్షన్, అగ్రిమెంట్లు చకచకా జరిగిపోయాయి.
ఇండస్ట్రీలో అప్పట్లో అందరూ అమిత్‌ను "కల విలన్" అని పిల్చేవారు. "కల" తర్వాత వందలాది సినిమాల్లో నటించి, మంచి పాపులర్ నటుడిగా ఎదిగాడు అమిత్.
దాదాపు అన్ని భాషల్లో నటించాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఎక్కువగా మాత్రం, విలన్ లేదా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్నే చేశాడు. ఈమధ్య పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్‌లో కూడా బాగా పాపులర్ అయ్యాడు.
అమిత్‌లో అద్భుతమైన నటుడున్నాడు. అంతకు మించి "ఇంకా... ఇంకా... ఇంకా నేను బాగా చెయ్యాలి" అన్న తపన ఉంది. ఆ తపనే అతన్ని నటుడిగా నిలబెట్టింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు - అమిత్ యాక్టింగ్‌ను నేను, మా కెమెరామన్ శంకర్, కో-డైరెక్టర్ వేణు, మా టీమ్... బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.
ఇప్పుడు మళ్ళీ అమిత్ హీరోగా నటించిన సినిమా "నల్లమల" రేపు మార్చి 18 నాడు థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అమిత్‌కు నా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు.
Wishing My Dear Amit All Success!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani