మనల్ని అన్‌కండిషనల్‌గా సరెండర్ చేయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో రెండే రెండు విషయాలకు ఉంది:
ఒకటి దేవుడు.
రెండోది డబ్బు.
జీవితంలో ఏం జరిగినా జాంతానై... డబ్బు డబ్బే!
ఈ ఒక్కవిషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌కు తావులేదు. బంధువులైనా, మిత్రులైనా, శత్రువులైనా, శ్రేయోభిలాషులైనా.
ఎవరైకైనా సరే, అనుభవిస్తేనేకానీ తెలీని నిజం మన జీవితంలో ఇదొక్కటే.
డబ్బుదగ్గర ఏ లాజిక్కులూ, ఏ నమ్మకాలూ, ఏ వ్యక్తిత్వాలూ, ఏ రిలేషన్లు పనిచేయవు. నిలవవు.
మన అనుభవంలోకి వచ్చేవరకూ ఈ నిజాన్ని మనం అస్సలు నమ్మలేం.
అద్భుతమైన స్నేహసంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలూ, వ్యామోహాలు కూడా కేవలం డబ్బుదగ్గరే చిన్న పరీక్షకు కూడా నిలబడవు. నిలువునా కూలిపోతాయి.
ఈ రేంజ్‌లో మనుషుల మధ్య పరీక్షలు పెట్టే శక్తి ఒక్క డబ్బుకి మాత్రమే ఉంది.
'డబ్బుదేముందిరా బై' అంటారు కొందరు.
చాలా ఉంది.
దేవుడి గుడికి వెళ్లాలన్నా డబ్బు కావాలి. ఆధ్యాత్మికానందంలో మునిగితేలాలన్నాడబ్బు కావాలి. ప్రశాంతంగా ఒక స్థాయిలో జీవితం గడపాలన్నా డబ్బు కావాలి. కప్పు చాయ్ త్రాగాలన్నా డబ్బు కావాలి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలన్నా డబ్బుకావాలి.
దటీజ్ ద పవరాఫ్ డబ్బు!
ఈ వాస్తవాలు తెలుసుకొనేటప్పటికి చాలామంది విషయంలో చాలా లేటయిపోతుంది.
జీవితంలో తనకు కావాల్సిన డబ్బుకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనం, ప్రయోజనం, పరిథి ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు.
అలా కానప్పుడే, మనిషి యంత్రమవుతాడు.
విచిత్రమేంటంటే - ఇలా ఒక యంత్రంగా మారిన మనిషికి కూడా, పొద్దునలేస్తే దండం పెట్టుకోడానికి ఒక దేవుడు కావాలి!
అందుకే ఈ రెండుచోట్లా అన్‌కండిషనల్‌గా సరెండరైపోతాడు మనిషి.