రేపు జరగనున్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, వారి ప్యానెల్ ఖచ్చితంగా గెలవబోతోంది.
నా వైపు నుండి ఇంకో నాలుగు వోట్లయినా ఎక్కువ రావాలని తెలుగు డైరెక్టర్స్ యూనియన్‌లో లైఫ్ మెంబర్‌గా, ఒక బాధ్యతగా, ఈ చిన్న పోస్టు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌లో దాదాపు ప్రతి క్రాఫ్ట్‌కూ ఒక యూనియన్ ఉంది. వీటిలో దర్శకుల యూనియన్‌దే అత్యున్నత స్థానం. మొన్నటిదాకా ఆ స్థాయి విలువ కూడా వుండేది. అయితే ఈ మధ్యకాలంలో యూనియన్‌లోని కొంతమంది వల్ల నానా అవకతవకలు జరిగాయి. యూనియన్ స్థాయి దిగజారిపోయింది.
జరిగిన ఎన్నో అవకతవకల్లో రెండు ఉదాహరణలు:
> అసలు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయని, ఏ రకంగానూ అర్హతలేని 32 మందికి యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో 32 ఫ్లాట్స్ ఇప్పించడం.
> డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నడూ పనిచేయని సుమారు 200 మంది ఇప్పుడున్న యూనియన్ మెంబర్స్ లిస్ట్‌లో ఉన్నారు! వీరికి రేపు ఎలక్షన్స్‌లో వోట్లు కాడా ఉన్నాయి(ట)!!
ఇవి చాలనుకుంటాను శాంపుల్‌కి ...
కట్ చేస్తే -
రేపు ప్రెసిడెంట్‌గా గెలవబోతున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఇవ్వాళ ఒక్కటే మాట గట్టిగా చెప్పారు:
"డైరెక్టర్స్ యూనియన్ ద్వారా చిత్రపురి కాలనీలో అక్రమంగా అలాట్ అయిన ఆ 32 ప్లాట్స్ సంగతి తేలుస్తాము. యూనియన్‌లో అర్హులైన మెంబర్స్‌కు వాటిని కెటాయిస్తాము. ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని ఉన్నా, దేన్నీ వదిలిపెట్టము!"
ఈ ఒక్క మాట చాలనుకుంటాను. ఎన్ శంకర్ గారి ప్యానెల్‌కు రేపు మనమందరం వోటెయ్యడానికి.
ఆ సత్తా దర్శక మిత్రులు ఎన్ శంకర్ గారికి, వారి ప్యానెల్‌కు ఉంది.
జరిగిన అవకతవకలను సరిదిద్దటం ఒక్కటే కాదు. దర్శకుల కోసం, యూనియన్ మెంబర్స్ కోసం ఇంకెన్నో అభివృద్ధి/సంక్షేమ సంబంధమైన పనులు చేయడానికి, దర్శకుల యూనియన్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించడానికి సిధ్ధంగా ఉన్న మన ఎన్ శంకర్ ప్యానెల్‌కు నాతోటి డైరెక్టర్స్ యూనియన్ మెంబర్స్ అందరూ వోటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
రేపు సాయంత్రం 4 గంటలకు ఆ శుభవార్త వింటాము కూడా ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani