ఎం పి గా పార్లమెంట్‌లో అది తన తొలి స్పీచ్.
అయినా ..
వెరీ కాన్‌ఫిడెంట్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్.
ఎలాంటి తడబాటు లేకుండా మంచి ఇంగ్లిష్‌లో దడదడలాడించేశారు. స్పీచ్‌లో అక్కడక్కడా ఓ రెండు మూడుసార్లు హిందీ కూడా తనకు బాగా వచ్చునని చెప్పకనే చెప్పారు.
తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని, కె సి ఆర్ గారిని, అటు సోనియా గాంధీని, ఇటు సుష్మా స్వరాజ్‌ను గురించీ ప్రస్తావించారు.
ప్రైమ్ మినిస్టర్‌ను, పార్లమెంట్‌లోని ఇతర పెద్దలనందర్నీ గౌరవిస్తూనే, అదే స్పీచ్‌లో అంటించాల్సిన చురకలన్నీ వరసపెట్టి అంటించారు కూడా:
ప్రెసిడెంట్ తన స్పీచ్‌లో కొత్తగా ఏర్పడిన 29 వ రాష్ట్రం అయిన తెలంగాణకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదన్నారు.
పోలవరం గురించీ .. ఆర్డినెన్స్ ద్వారా ఏపిలో కలిపిన 7 మండలాల్లోని ఆదివాసీల సంక్షేమం కోసం చెయ్యాల్సిన దానిగురించి కూడా చెప్పారు.
కట్ టూ కష్మీరీ పండిట్స్ -
మరోసారి అదే పార్లమెంట్‌లో .. తన ఇంకో స్పీచ్‌లో .. కష్మీరీ పండిట్స్ గురించి దడదడలాడించేశారు ఇదే ఎం పి గారు.
నాకు తెలిసి .. ఏపీ, తెలంగాణలకు సంబంధించిన ఎం పి లెవరూ పార్లమెంట్‌లో ఇప్పటివరకూ ఈ అంశం మీద అసలు మాట్లాడి ఉండరు అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడి ఉన్నా, ఖచ్చితంగా ఇంత లోతుగా సమస్యను అధ్యయనం చేసి ఉండరని నా గట్టి నమ్మకం.
ఈ విషయంలో ఇంత నమ్మకంగా నేను చెప్పగలగడానికి కారణం కూడా ఒకటుంది.
సీనియర్ మోస్ట్ ది గ్రేట్ అద్వానీ గారు లేచి, ఇదే అంశం గురించి తర్వాత మాట్లాడుతూ, అప్పటిదాకా మాట్లాడిన ఈ ఎం పి ని ఒకటికి నాలుగుసార్లు మెచ్చుకున్నారు.
ఇటీవలే పార్లమెంట్‌లో నేషనల్ లెజిస్లేటర్స్ కాన్‌ఫరెన్స్ "ప్లీనరీ సెషన్"కు మాడరేటర్‌గా కూడా అద్భుతంగా వ్యవహరించి తన సత్తా చాటుకున్నారు.
ఇప్పుడు పార్లమెంట్‌లో ఉన్న ఈ తరం మహిళా ఎం పి లకు, రానున్న ఔత్సాహిక మహిళా ఎం పి లకు, మహిళా పొలిటీషియన్‌లకు తను ఒక ఐడల్, ఒక ఐకాన్ ...
దటీజ్ మన ఎం పి.
ఆ ఎం పి ఎవరో కాదు.
కల్వకుంట్ల కవిత.
తెలంగాణ జాగృతి సారథి. మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి కూతురు.
కట్ టూ మన బంగారు బతుకమ్మ -
ఒకప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించారు. తెలాంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను ఎగతాళి చేశారు. ఆ బతుకమ్మ ఆడే తెలంగాణ ఆడబిడ్డల్ని అవహేళన చేశారు.
అదిప్పుడు చరిత్ర.
తెలంగాణ అవతరణకు ముందు కథ.
తెలంగాణ జాగృతి ఏర్పాటుకు ముందు కథ.
మరిప్పుడో?
ఎక్కడ విన్నా "జై తెలంగాణ!" .. "జై కె సి ఆర్!"
ఎక్కడ చూసినా .. బంతిపూలు, చామంతులు, నందివర్ధనాలు, తంగేడుపూలు, రంగులద్దిన గునుగు పూలు. ఆ పూలతో పేర్చిన బతుకమ్మలు. ఆ బతుమకమ్మలను ఆనందంగా ఆడే ఆడబిడ్డలు.
అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. గిన్నిస్ రికార్డు బద్దలయ్యేలా!
అంతేనా .. నో.
ఒక్క తెలంగాణలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరిలోనూ అంబరాన్నంటిన ఇదే ఆనందం.
ఒక్క రాజకీయంగానే కాదు. సాంస్కృతికంగా కూడా.
దుబాయ్ నుంచి డెన్మార్క్ దాకా .. 17 రోజులు, 9 దేశాలు. అవిశ్రాంత తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ సంకల్ప యాత్ర.
ఎక్కడికెళ్లినా తెలంగాణకు జేజేలు, మన బంగారు బతుకమ్మకు హార్దిక ఆహ్వానాలు.
ది రినైజెన్స్ ఆఫ్ బతుకమ్మ ..
మన బతుకమ్మకు మళ్లీ కళ వచ్చింది.
ఈ కళ ఏ స్థాయిలో వచ్చిందంటే .. ఇప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డ గర్వంగా బతుకమ్మను పేర్చుతోంది. ఆడుతోంది. పాడుతోంది. పోటీలుపడి సెల్ఫీలు దిగుతూ ఫేస్‌బుక్ నిండా తన ఆనందాన్ని ఆవిష్కరిస్తోంది.
మొన్నటి బతుకమ్మ పండుగకు ఫేస్‌బుక్ నిండా, బతుకమ్మలతో ఎన్ని లక్షల సెల్ఫీలు పోస్ట్ చేశారో ఒక్కసారి అలా గుర్తుకుతెచ్చుకోండి.
"వావ్!" అని జకెర్‌బర్గే జెర్క్ తినేలా !
క్రెడిట్ గోస్ టూ ..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మన ఎం పి కవిత గారు.
వారికివే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani