Sunday, 4 February 2018

ఒక ఓవర్‌నైట్ సక్సెస్, వంద నిజాలు!

అనుకోకుండా మొన్న రాత్రి ఒక అద్భుతమైన మీటింగ్.

ఒక సీనియర్ అధికారితో, వాళ్ల ఇంట్లోనే.

సుమారు మూడు గంటలపాటు!

మేము కలిసిన సందర్భం వేరే. మాట్లాడుకున్న విషయాలు వేరే.

అతని సింప్లిసిటీ, అతని ముక్కుసూటితనం. అతని రిస్క్ టేకింగ్ నేచర్, అతని ఇప్పటి ఉన్నతస్థాయి ఉద్యోగం, హోదా .. ఇవన్నీ ఓకే.

గొప్ప విషయాలే.

వాటి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ, ఇప్పుడు నేనవన్నీ ఇక్కడ చర్చించబోవడంలేదు.

వీటన్నిటినిమించి, మా సంభాషణ మధ్యలో వచ్చిన ఆయన ప్రారంభ జీవితానికి సంబంధించిన ఒక జీవితవాస్తవం నన్ను బాగా కదిలించింది.

రూట్స్ ...

"మనం ఎక్కడి నుంచి, ఎలాంటి ప్రారంభ జీవిత వాస్తవం నుంచి, ఏ స్థాయి కృషి ఫలితంగా ఇప్పుడున్న స్థాయికి ఎదిగామో ... ఆ నేపథ్యం, ఆ గతం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు."

ఇవి మనం చిన్నప్పటినుంచీ పుస్తకాల్లో చదివిన మాటలు, అంతకు ముందు మనకు బాగా తెలిసిన మాటలే.

అయినా .. మొన్న రాత్రి, నా ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి జీవిత వాస్తవ నేపథ్యంలోని ఒక చిన్న శాంపుల్ విన్న తర్వాత మాత్రమే మొదటిసారిగా ఈ మాటల అసలు విలువ నాకు బాగా అర్థమైంది.

కట్ టూ మన టాపిక్ - 

ఓవర్‌నైట్ సక్సెస్ అనే మాట మనం తరచూ వింటుంటాం. అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించడం అన్నమాట!

నిజానికి అలాంటిది లేదు.

ఓవర్‌నైట్ సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటివారికి కనిపించదు. వారికి కనిపించ్గేది రెండే రెండు విషయాలు:

సక్సెస్ .. ఫెయిల్యూర్. 

"It took me 15 years to get overnight success!"

'స్పిరిచువల్ మార్కెటింగ్ గురు' జో వైటలి రాసిన ఒక పుస్తకంలో సుమారు పదేళ్లక్రితం నేనీ వాక్యం చదివాను.

అది, జో తనగురించి తను రాసుకున్న వాక్యం.

మొన్న నేను కలిసిన అధికారి విషయంలో కూడా జరిగింది ఇదే.

ఇప్పుడు ఆయనున్న స్థాయి, ఆయన సాధించిన విజయాలు, ఆయన ఇప్పుడు చేస్తున్న పెద్ద ఉద్యోగం ... ఇవన్నీ నిజంగా గొప్పవే.

కానీ, అదంతా ఓవర్‌నైట్ సక్సెస్ మాత్రం కాదు.

ఆ సక్సెస్ వెనుక సుదీర్ఘమైన కృషి, జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు, మరెన్నో రిస్కులు, లెక్కలేనన్ని కష్టాల నేపథ్యం ఉంటుంది.

ఆ నేపథ్యం మాత్రం అందరికీ తెలియదు.

ప్రతి విజయం వెనుక అలాంటి ఒక నేపథ్యం ఉంటుందన్న స్పృహ ఉన్నవారు మాత్రమే అలాంటి 'ఓవర్‌నైట్ సక్సెస్'లు సాధించగలుగుతారు.
^^^
#OvernightSuccess #RealityBehindSuccess #SuccessScience   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani