Saturday, 3 February 2018

రూల్ '30/30/40' ఏంటో మీకు తెలుసా?

గాబ్రియెల్ రీజ్.

వాలీబాల్ ప్లేయర్, ప్రపంచస్థాయి టాప్ మోడల్స్‌లో ఒకరు.

మన జీవితాల్ని అమితంగా ప్రభావితం చేసి, మన జీవనపథాన్ని, మన జయాపజాయాల్ని, మన జీవనశైలిని కూడా శాసించగలిగే శక్తి ఉన్న మన మైండ్‌సెట్‌కు సంబంధించిన ఒక అతి చిన్న నిజాన్ని మరింత చిన్న గా .. జస్ట్ ఒక మూడు ముక్కల్లో చెప్పింది రీజ్.

ఒక ఇంటర్వ్యూలో రీజ్ చెప్పిన ఈ మూడు ముక్కల్ని విని, ప్రభావితమై, ప్రపంచవ్యాప్తంగా వారి వారి రంగాల్లో అత్యున్నతస్థాయి శిఖరాలకెదిగినవారెందరో!

అలా ప్రభావితమై, తన మైండ్‌సెట్‌ను మార్చుకొని, తన వృత్తిలో తను కోరుకొన్న అత్యున్నత శిఖరస్థాయికెదిగిన ఒక అమెరికన్ అంతర్జాతీయస్థాయి యోగా టీచర్ రాసిన ఒక ఉత్తరం ద్వారా నేనీ విషయం తెల్సుకున్నాను.

దీని గురించి ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే బ్లాగ్‌లో రాసినట్టు గుర్తు.

అయినా మళ్ళీ రాస్తున్నాను ...

కట్ టూ ది రూల్ - 

గాబ్రియెల్ రీజ్ ప్రకారం .. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనల్ని ఇష్టపడేవారు ఒక 30 శాతం ఉంటారు.

మనం ఎంత బాగా ఉన్నా సరే, ఏం చేసినా సరే .. మనల్ని ఏదోరకంగా విమర్శించి బాధపెట్టాలనుకొనే మనల్ని ఇష్టపడనివారు మరొక 30 శాతం మంది ఉంటారు.

మిగిలిన 40 శాతం మంది అసలు మనల్ని పట్టించుకోరు!

ఇదే .. రూల్ 30/30/40.

జీవితంలో ఎన్నోరకాల అనుభవాలు ఎదుర్కొని, వాటిని తట్టుకొని, ముందుకు సాగి, తను అనుకున్న విజయాల్ని సాధించింది కాబట్టే .. రీజ్ ఇంత సింపుల్‌గా ఈ విషయం చెప్పగలిగింది. 

ఇప్పుడు ఆలోచించండి.

రీజ్ చెప్పిన మొదటి 30 మందిని గురించి పట్టించుకొందామా? చివరి 70 మంది గురించి ఆలోచిద్దామా?

అదే మన మైండ్‌సెట్‌ను చెబుతుంది.

అదే మన జీవితాన్ని, జీవనశైలిని, మన జయాపజయాల్ని శాసిస్తుంది.
^^^
#Mindset #Rule303040 #GabrielleReece #SuccessScience     

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani