ఈ టైటిల్‌తో నిన్న నేనొక బ్లాగ్ రాసి, దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను.
ఈ పోస్ట్ సృష్టించిన సంచలనం ఒక రేంజ్‌లో ఉంది.
పొగడ్తలూ, అలకలూ, కోపాలూ.
బట్ ... అందరూ మన మిత్రులే. అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నవాళ్లే.
మన తెలంగాణ, మన కేసీఆర్.
కట్ చేస్తే -
"ఎలాంటి బ్రౌజింగ్ చెయ్యకుండా, ఏమాత్రం ఆగకుండా, తడుముకోకుండా, నాకు అలవోకగా గుర్తొచ్చిన పేర్లు ఇవన్నీ. కొంచెం సమయం తీసుకొని ఆలోచిస్తే ఇంకో 100 పేర్లు ఈజీగా గుర్తుకొస్తాయి. ఆన్ లైన్లోకి వెళ్తే పెద్ద లిస్టే అవుతుంది." ... అని ఆ పోస్టు ప్రారంభంలోనే చాలా క్లియర్‌గా చెప్పాను.
అలా, పోస్టు ప్రారంభంలో ఒక చిన్న సాంపిల్‌గా, ఒక లీడ్‌గా నేను రాసిన ఆ పేర్లన్నీ .. ఆ పోస్ట్ రాస్తున్నప్పుడు నాకు అప్పటికప్పుడు గుర్తుకొచ్చినవి మాత్రమే తప్ప, వాళ్లే అందరూ కాదు.
అతిరథమహారథులైన సీనియర్లు, పెద్దలు, మిత్రులు కూడా ఇంకా ఎందరో ఉన్నారు.
"అసలు మన సోషల్ మీడియా సైన్యం ఎందుకు ... దాని అవసరం ఏంటి, దాని ఇంటెన్సిటీ ఎంత గొప్పది" ... అన్న విషయం చర్చించడమే ఆ పోస్టు ప్రధానోద్దేశ్యం తప్ప, మన సైన్యం లిస్ట్ అంతా సేకరించి రాయడం కాదు.
అదంత సులభం కూడా కాదు.
ఎందుకంటే మన సైన్యం వందల్లో కూడా కాదు, వేలల్లో ఉంది!
మన సైన్యం ఇంటెన్సిటీ, అవసరం గురించి చెప్పడమే ఇక్కడ ప్రధానం తప్ప వ్యక్తులు కాదని మరొక్కసారి నా సవినయ మనవి.
పెద్దలు, సీనియర్లు, మిత్రులు ఈ విషయాన్నీ, నన్నూ అర్థం చేసుకొన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
లక్ష్యం ముఖ్యం.
వ్యక్తులు కాదు!
కట్ చేస్తే -
ఇక మీదట నా పోస్టులు ఎవరైనా తమ వాల్ మీద పోస్ట్ చేయాలనుకొంటే, దయచేసి Written by అని నా పేరు 'పైన టైటిల్ దగ్గర' వేయగలిగితేనే పోస్ట్ చేయండి. లేదంటే షేర్ చేయండి.
ఈ రెండూ చేయలేము అనుకొంటే, అసలు ఈ పని చేయకండి .. అని నా సవినయ మనవి.
దయచేసి తప్పుగా అనుకోవద్దు.
పైన నాపేరు లేకుండా, డైరెక్టుగా వారి టైమ్‌లైన్ మీద కాపీ పేస్ట్ చేసిన కారణంగా ... ఆ పోస్టు వారే రాసినట్టుగా ఉంటుంది తప్ప, క్రింద ఎక్కడో Written by అని నా పేరు రాసింది చాలామంది చూడరు.
దీనివల్ల ఏర్పడిన "అసలెవరు రాశారు ఈ పోస్టు?" అన్న కన్‌ఫ్యూజన్‌తో, చాలా మెసేజ్‌లు నా ఇన్‌బాక్స్‌లో చదివాక, ఈ పాయింట్ గురించి ఇంత వివరంగా, ఇలా, రాయాల్సిరావడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది.
ఈ రిక్వెస్టు ... కేవలం పదే పదే రిక్వెస్టు చేసినా అసలు పట్టించుకోని అలాంటి కొందరు మిత్రుల కోసమే. వారు కూడా అన్యధా భావించరనే నా నమ్మకం.
కట్ చేస్తే -
ఇదంతా ఎలా ఉన్నా, నేను రాసిన ఈ "సోషల్ మీడియా సైన్యం ... కేసీఆర్ కోసం!" పోస్టు వల్ల మొత్తానికి మన సోషల్ మీడియా సైన్యం చాలా అప్రమత్తంగా ఉందని మాత్రం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది.
It's a very good sign!
మన సోషల్‌మీడియా సైన్యంలో ఎందరో మహానుభావులు. అందరికీ పేరుపేరునా వందనాలు.
^^^
#KCR #TRS #TRSSocialMedia #TelanganaSocialMedia #Telanagana #SocialMediaSainyam #ManoharChimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani