అప్పుడే 14 ఏళ్లు ...
నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా బావమరిది చీరాల పురుషోత్తం, IRS పుట్టినరోజు ఇవాళ!
కానీ .. తను మరణించి అప్పుడే 14 ఏళ్ళు అయ్యిందన్న నిజం నన్నీరోజు చాలా బాధపెడుతోంది.
బట్ .. దిస్ ఈజ్ లైఫ్!
అన్నీ మనం అనుకున్నట్టు జరగవు.
నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారిలాగే ఈరోజు కూడా బాధపడుతున్నాను. కానీ, అది తప్పని కూడా నీ జ్ఞాపకాలే నాకు గుర్తుచేస్తున్నాయి.
జీవితంలో ఎన్నెన్నో మనకు ఇష్టంలేనివి, మనం ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం ముఖ్యం.
ఆ ఆత్మవిశ్వాసానికి పర్యాయపదం నువ్వు.
అవధులులేని నీ ఆత్మ విశ్వాసం, నీ చిరునవ్వు, ఆ చిరునవ్వుతోకూడిన నీ ప్రతి పలకరింపు నేనెన్నటికీ మర్చిపోలేను.
మిస్ యూ పురుషోత్తమ్ ..
#ChiralaPurushotham #IRS #ChiralaPurushothamIRS #PurushothamIRS

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani