ఇంకో 24 గంటల్లో, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు నా కొత్త టీమ్‌తో మళ్లీ ప్రెస్ ముందుకు రాబోతున్నాను. ఇదొక తప్పనిసరి రొటీన్ కాబట్టి పెద్ద ఎక్జయిటింగ్‌గా ఏం లేదు.
కాకపోతే .. ఈ ప్రెస్‌మీట్‌కు, ఇది పెట్టడానికి కారణమయిన ఈ సినిమాకు కొన్ని చిన్న చిన్న ప్రత్యేకతలున్నాయి.
అవన్నీ ప్రెస్‌మీట్ లోనే మొదటిసారిగా చెప్పాల్సి ఉంది కాబట్టి ఇక్కడ, ఈ టైమ్‌లో రాయలేకపోతున్నాను.
సుమారు 26 టీవీ చానెళ్లు, ఒక డజన్ వెబ్‌సైట్లు, మరో పది ఫిలిమ్ మ్యాగజైన్లు, ఇంకో ఎనిమిది డైలీ న్యూస్‌పేపర్లు .. ఈ ప్రెస్‌మీట్‌ను కవర్ చేస్తాయి. రేపు రాత్రినుంచి, ఓ రెండు రోజులవరకు, దీనికి సంబంధించిన ఫుటేజ్ రకరకాలుగా ఆయా చానెళ్లలో వస్తుంది.
ముందే చెప్పినట్టు, ఇదొక తప్పనిసరి అయిన రొటీన్.
కట్ టూ టైటిల్ లోగో లాంచ్ -
మొన్నటిదాకా ఎలాగూ మా సినిమా టైటిల్ ప్రకటించలేదు కాబట్టి, పనిలో పనిగా, ఈ ప్రెస్‌మీట్ లోనే "స్విమ్మింగ్‌పూల్" టైటిల్ లోగో కూడా విడుదల చేస్తున్నాము.
మంత్ర, మంగళ వంటి మంచి హారర్/థ్రిల్లర్స్ ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు ఓషో తులసీరామ్ టైటిల్ లోగోను ఆవిష్కరిస్తారు.
ఈ సందర్భంగా .. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కొంతమంది నా ఆత్మీయ ప్రెస్ మిత్రులను, మొత్తంగా ప్రెస్ ఫ్రాటర్నిటీని, చాలా గ్యాప్ తర్వాత రేపు మళ్లీ కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani