"ఏ మాయ చేసావె"లో నాగచైతన్య సమంతతో అంటాడు.
"యూ ఆర్ సో హాట్!" అని.
చురుగ్గా చూస్తుంది సమంత. "ఐ మీన్ క్లైమేట్ చాలా హాట్‌గా ఉందీ అంటున్నాను" అని మళ్లీ సర్ది చెబుతాడు నాగచైతన్య. తను ఏమనుకుంటుందోనని.
కానీ, సమంత పెద్ద సీరియస్‌గా తీసుకోదు. ఒక కాంప్లిమెంట్‌గా తీసుకొని తనలో తను నవ్వుకుంటుంది.
"హాట్" లాంటి కొన్ని మాటలు, విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డం, చర్చించడం ఇంకా మనదగ్గర ఓ పనికిరాని టాబూగానే ఉండటం నేనింకా నమ్మలేకపోతున్నాను. కానీ, నిజం అదే.
అసలేందీ హాట్?
సినిమాల విషయానికొస్తే - కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న రొమాన్స్ ని "హాట్ రొమాన్స్" అనవచ్చునేమో!
మరో అర్థంలో - ఎవరయినా ఒక అమ్మాయో, అబ్బాయో చూడగానే కత్తిలా కనిపించినా, వారు 'ఒక' మూడ్‌లో ఉన్న విషయం గమనించినా చాలు. ఏ మాత్రం కొంచెం చనువున్న ఫ్రెండయినా (బాయ్/గాళ్) ఆ అమ్మాయినో, అబ్బాయినో ఉద్దేశించి ఈ 'హాట్' పదం వాడొచ్చు.
ఇదంతా రొమాన్స్ కు సంబంధించిన 'హాట్' చర్చ.
రొమాన్స్‌కు, తత్ సంబంధమయిన మూడ్‌కూ అసలు సంబంధం లేకుండా - "వాడివాళ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు" అని కోపం అర్థంలో కూడా ఈ హాట్ పదాన్ని వాడొచ్చు.
ఈ థియరీ అంతా కాసేపు పక్కనపెడితే - అసలు "హారర్" పదం కంటే "హాట్" పదమే మన జనాలని ఎక్కువగా భయపెడుతున్నట్టుంది చూస్తోంటే!
కట్ టూ మన "హాట్" స్విమ్మింగ్‌పూల్ -
"స్విమ్మింగ్‌పూల్" సినిమా ఓ మంచి రొమాంటిక్ హారర్. ఈ రొమాన్స్ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఓ మోతాదులో ఉంది అని డైరెక్టర్‌గా నేనే చెప్తున్నాను.
ఈ కోణంలో ఆలోచించినపుడు, పోస్టర్ మీద 'హాట్ రొమాంటిక్ హారర్' అనే ముద్ర వేయడం నాకేమంత పెద్ద విషయంగా అనిపించలేదు.
అలాగని - జంటగా కానీ, ఒంటరిగా కానీ చూడలేనంత ఇబ్బందికరమైన చిత్రీకరణ కూడా ఇందులో ఏమీలేదు. ఇదేం బి గ్రేడ్ సినిమా కాదు.
పోనీ .. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందనీ, ఏదో చూపించాలనీ మేమెన్ని బిజినెస్ జిమ్మిక్కులు చేసినా చివరికి సెన్సార్ అంటూ ఒకటి ఉండనే ఉంది! ఏమాత్రం తేడా వచ్చినా - అక్కడ మా పరిస్థితి రొంబ హాట్ హాట్ గా ఉంటుంది. అది వేరే విషయం.
ఈ విషయంలో నాకు నచ్చిన ఒకే ఒక్క డీసెంట్ లాజిక్ ఏంటంటే - "హాట్ అనేది బయట చెప్పడం దేనికి? సినిమాకు వచ్చేవాళ్లు కొందరు ఆ పదం చూసే ఇబ్బందిపడి రాకపోవచ్చు. సో, ఆ హాట్ ఏదో సినిమా లోపల చూపించండి. బయట వద్దు!" అని.
చాలా అర్థవంతమయిన ఈ లాజిక్ వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది. మా టీమ్ అందరికీ కూడా నచ్చి తీరాలి మరి. చూద్దాం.
ఇదంతా ఎలా ఉన్నా - సినిమాలో ఏముందన్నది కాదు ప్రశ్న. ఆ సినిమాను ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఎంత ఎట్రాక్టివ్‌గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నదే అసలు ప్రశ్న.
దీన్నే మార్కెటింగ్ అంటారు, బహుశా!
ఈ మార్కెటింగే రేపు మాకు బిజినెస్ తెచ్చేదీ, ఇచ్చేదీ. దీనికోసం నానా బిజినెస్ జిమ్మిక్స్ తప్పవు. ప్రస్తుతం మా టీమంతా ఈ ప్రాసెస్ లో యమ 'హాట్' గా ఉన్నాం.
ఫినిషింగ్ టచ్ ఏమిటంటే - పోస్టర్ మీదున్న ఈ "హాట్ రొమాంటిక్ హారర్" ముద్రనూ, అందులో ఉన్న "హాట్"నీ, మా అసలు టార్గెట్ ఆడియెన్స్ చూడరనీ, చూసినా పెద్దగా పట్టించుకోరనీ .. మా బిజినెస్ వర్గాల మిలియన్ డాలర్ అభిప్రాయం!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani