ఎప్పుడో యుగాల కిందటి ఋషులు, గురువులు సరే. మన ఆధునిక స్పిరిచువల్ గురువులు కొందరిని చూస్తే మాత్రం నవ్వొస్తుంది. లేటెస్ట్ "లైఫ్ పాజిటివ్" మ్యాగజైన్‌లో ఒక ఆర్టికిల్ చదివాక వెంటనే రాస్తున్న పోస్ట్ ఇది.
గడ్డాలూ, మీసాలూ బాగా పెంచుకొని.. అయితే కాషాయ వస్త్రాలో, లేదంటే తెల్ల దుస్తులో వేసుకొని చిద్విలాసంగా నవ్వడం స్పిరిచువాలిటీ ఎంతమాత్రం కాదు.
కొందరు ఆధ్యాత్మిక గురూజీలు నున్నటి గుండుతో కూడా ఉంటారు. ఇంకొందరయితే దాదాపు ఒంటిమీద ఏమీలేకుండా కూడా ఉన్న దాఖలాల గురించి విన్నాను. చదివాను. (నా అదృష్టం కొద్దీ నేను వారిని చూళ్లేదు!)
స్పిరిచువాలిటీ అంటే పైకి కనిపించే గెటప్ ఎంతమాత్రం కాదు. అదంతా ఉట్టి "షో".
నిజానికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు కూడా టిప్ టాప్‌గా టక్ చేసుకోవచ్చు. టై కూడా కట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే - సౌకర్యం కోసం జీన్స్‌లు, టీషర్టులు, మిడ్డీస్, మినీస్ కూడా వేసుకోవచ్చు. నిత్యజీవితంలోని రొటీన్ పనులన్నీ చేసుకోవచ్చు. వీళ్లు ఇలాంటి దుస్తులే ధరించాలి.. ఇలాగే ఉండాలని రూల్స్ ఏమీ లేవు.
ఆధ్యాత్మికత అనేది మన మనసుకు సంబంధించింది.
ఎవరి బోధనలు విన్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఎన్ని ప్రాచీన గ్రంథాలు చదివాము, ఎన్ని ఆధునిక పుస్తకాలు చదివాము అన్నది కాదిక్కడ ప్రశ్న. వాటన్నిటి ద్వారా తెలుసుకున్నదానితో నిన్ను నువ్వు ఏం తెలుసుకున్నావన్నదే సిసలైన స్పిరిచువాలిటీ.
ఈ జ్ఞానోదయానికున్న పవర్ ముందు మరింకే శక్తీ నిలవదంటే అతిశయోక్తి కాదు.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani