సినీ ప్లానెట్ దగ్గరున్న ఓ రెస్టారెంట్లో నేనూ, ఓ డిస్ట్రిబ్యూటర్ మిత్రుడు కూర్చున్నాము. మేం ఏదో మాట్లాడుకుంటూ ఉండగా - నా మిత్రుడి మొబైల్‌కు ఓ ఎస్ ఎం ఎస్ వచ్చింది.
అది రాజమౌళి మాగ్నమ్ ఓపస్ "బాహుబలి"కి సంబంధించింది.
నైజాంలో 27 కోట్ల ఆఫర్ వచ్చిందిట బాహుబలికి! అంటే.. మిగిలిన ఆంధ్రా, సీడెడ్‌లలో (అదే, ఇప్పుడు బాగా పాపులర్ అయిన "సీమాంధ్ర") కలిపి ఇంకో 40 కోట్లు కళ్లుమూసుకొని వస్తుంది. ఇక శాటిలైట్స్ రైట్స్ విషయానికొస్తే.. అది 55 కోట్లకి ఫిక్స్ అయినట్టు సమాచారం!
ఇందులో నిజానిజాలెంతో తెలీదుగానీ - ఒక తెలుగు సినిమా బిజినెస్, దాని రిలీజ్‌కు ముందే 120 కోట్లు దాటేసిందన్నమాట!
ఇదేగాని నిజమయితే - బాహుబలి సినిమానే తెలుగులో తొలి "100 క్రోర్స్ క్లబ్" సినిమాగా చరిత్రలో నిల్చిపోతుంది.
అయితే.. ఆ చరిత్ర చూడ్డం కోసం కూడా మనం 2015 వరకు.. ఇంకో ఏడాది ఆగాలి!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani