పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైపోయింది. ఆ రాజకీయాలు, ఆ హడావిడి కాస్త చల్లబడింది. ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రాంతం గొడవల్లో వారున్నారు.
కట్ టూ మన పాయింట్ -
మూడు చిత్రాలు రూపొందించిన దర్శకునిగా నాకు (కలిసి ఉన్న ఎ పి లోని) తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌లో లైఫ్ మెంబర్‌షిప్ ఉంది. అయితే.. అంకె రీత్యా, ఆధిపత్యం రీత్యా అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ దర్శకుల అసోసియేషన్. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఈ స్టేట్‌మెంట్‌లో ఎలాంటి నెగెటివిటీ లేదు. జస్ట్ మనం ఒప్పుకోవాల్సిన రియాలిటీ తప్ప.
రాష్ట్రం ఎలాగూ విడిపోయిందికదా అని.. తెలంగాణ దర్శకుల సంఘంలోనూ మెంబర్‌షిఫ్ తీసుకుందామనుకున్నాను. ఎక్కడా ఎవరి అడ్రసూ దొరకలేదు. పేపర్లలో వీరి స్టేట్‌మెంట్లు, ప్రెస్‌నోట్లు మాత్రం కోకొల్లలుగా వస్తున్నాయి!
ఒకరిద్దరు తెలంగాణ దర్శక మిత్రులకి ఫోన్ చేశాను. ఏం తెలీదన్నారు వాళ్లు.
రాష్ట్ర విభజన జరిగాక - ఒక సీనియర్ తెలంగాణ దర్శకుని అధ్వర్యంలో.. తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వ్యవహారాలపైన ఒక కొత్త సిస్టమ్‌ని రూపొందిస్తున్నట్టుగా అప్పట్లో పేపర్లలో చదివాను.
మళ్లీ ఈ మధ్య - ఇంకో తెలంగాణ సీనియర్ దర్శకుడిచ్చిన ప్రెస్‌నోట్లు వరుసగా రెండు చదివాను. ఆయన కూడా తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడని ఆ ప్రెస్‌నోట్స్ ద్వారానే తెలిసింది నాకు!
"కూడా" అని పైన ఎందుకన్నానంటే - ఇలా ఎవరికి వాళ్లు ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకుంటున్నారని తెలిసి!
వెంటనే ఆయా సంఘాల నంబర్లు, అడ్రసులూ తీసుకుందామని తెలంగాణ ఫిలిం చాంబర్‌కు ఫోన్ చేశాను.
" సార్! ఒక్కటి కాదు. ఇలా చాలా ఉన్నాయి. ఎవరికివాళ్లు ఏదో చేస్తున్నారు.. లేదా చేసేస్తున్నాం అనుకుంటున్నారు. దీనిగురించే మా చాంబర్ మీటింగ్‌లో వచ్చే వారం చర్చించబోతున్నాం. అంతే తప్ప.. వాళ్ల నంబర్లు, ఆఫీస్ అడ్రస్‌లూ మాదగ్గరేం లేవు!" అన్నారు తెలంగాణ చాంబర్ వాళ్లు.
శుభం. ఆ చాంబర్ మీటింగేదో తొందరగా జరిగి, ఏదయినా సరే.. అంతా ఓ పధ్ధతిలో జరిగేట్టుగా స్ట్రీమ్‌లైన్ చేసేస్తే బావుంటుంది.
నాకు సంబంధించిన అసోసియేషన్స్‌లో నేనూ చేరతాను. ఉడతా భక్తిగా నేను చేయగలిగిందేదో నేనూ చేస్తాను.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani