తెలంగాణ ఉద్యమ నేత, కాబోయే ముఖ్యమంత్రి కెసీఅర్ దీన్ని ఓకే చేశారని విన్నాను. ప్రమాణస్వీకారం అనంతరం జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలోనే దీన్ని అఫీషియల్‌గా ఓకే చేస్తారు. తర్వాత ఈ రాజముద్ర అధికారికంగా అమల్లోకి వస్తుంది.
ఇక్కడివరకూ ఓకే. ఈ టాపిక్ గురించి బ్లాగ్‌లో రాస్తున్నానంటే, దానికో ప్రత్యేక కారణముంది.
కట్ టూ లక్ష్మణ్ ఏలే!
ప్రముఖ అంతర్జాతీయస్థాయి తెలంగాణ చిత్రకారుడు, ప్రారంభంలో ఎన్నో రాంగోపాల్ వర్మ చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, క్రియేటివ్ రియలిస్ట్ అయిన మిత్రుడు లక్ష్మణ్ ఏలే ఈ రాజముద్రని డిజైన్ చేయడం పెద్ద విశేషం.
కంగ్రాట్స్, లక్ష్మణ్ భాయ్! ఇప్పుడే కాదు.. రాబోయే తరాల్లోని ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మీ పేరుని కనీసం ఒక్కసారయినా స్మరించుకుంటారు.
అన్నట్టు.. నేను నంది అవార్డ్ పొందిన నా "సినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం" పుస్తకానికి కవర్ డిజైన్ చేసింది కూడా లక్ష్మణ్ ఏలేనే!
కట్ టూ కాకతీయుల చిహ్నం -
రాజముద్ర డిజైన్‌లో - మూడు సిమ్హాలు, సత్యమేవజయతే, చార్మినార్‌లతోపాటు.. నా జన్మస్థలం వరంగల్‌కు చెందిన కాకతీయుల ద్వారతోరణం ప్రముఖంగా ఉండటం కూడా ఈ రాజముద్రకి మరింత ఆకర్షణని తెచ్చింది. థాంక్ యూ, లక్ష్మణ్ భాయ్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani