Tuesday, 22 April 2014

సత్యజిత్ రే ఏమన్నారు?

సినిమా పిచ్చి..

దీన్నే ఇంగ్లిష్‌లో "ప్యాషన్" అని కొంచెం స్టయిలిష్‌గా అంటారనుకోండి.

ఒకసారి ఇది కుట్టిందా.. అంతే. ఇక జీవితాంతం వదలదు. మనకై మనం వదిలించుకుందామన్నా కుదరని పరిస్థితులు పుట్టుకొస్తాయి. అదీ సినిమా పవర్!

ఒక్క సినిమాకు మాత్రమే ఆ పవర్ ఉంది. దానికి కారణాలు కనీసం ఓ  వందయినా నేను చెప్పగలను. కాని, దాని గురించి మరోసారి చర్చిద్దాం.

ఇక్కడ నేను చర్చిస్తున్న పాయింటు ఆర్ట్ సినిమానా, కమర్షియల్ సినిమానా అన్నది కాదు. పేరుకోసం వచ్చామా, డబ్బుకోసం వచ్చామా అన్నది కూడా కాదు.

ఇదొక ప్యాషనేట్ పద్మవ్యూహం!

ఎందుకు, ఎలా ఎంటరయ్యాం అన్నది అసలు ప్రశ్నే కాదు. ఎంటర్ అవటం వరకే మన చేతుల్లో ఉంటుంది. ఎక్జిట్ ఎలా ఉంటుందో ఏంటో ఎవరూ చెప్పలేరు. కష్టం.

ఇదంతా పక్కన పెడితే - సత్యజిత్ రే ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. "సినిమా తీయాలి అన్న ప్యాషన్ ముఖ్యం. మిగిలినవన్నీ అవే జరిగిపోతాయి. అవే వస్తాయి. అవే సమకూరతాయి!" అని.

ఎంత సత్యం!

ఊరికే మనవాళ్లలా ఏదో సొల్లు చెప్పడం కాదు. రే ప్రాక్టికల్‌గా దీన్ని చేసి చూపించారు. ఒకటా రెండా.. ఎన్నో సినిమాలు. డబ్బులగురించి ఎప్పుడూ ఆయన అలోచించలేదు. తాను తీయాలనుకున్న సినిమా గురించే ఆలోచించారు. డబ్బులు అవే సమకూరాయి. పైగా.. ఆయన తీసినవేవీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు కూడా కాదు!

ఇంక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? మీరు తెలుసుకోవాల్సిందేముంది? మీరయినా, నేనయినా.. ఇక చేయాల్సిందే ఉంది.

అన్నట్టు - రే చెప్పిన ఈ గోల్డెన్ వర్డ్స్ ఒక్క ఫిలిం మేకింగ్‌కే పరిమితం కాదు. ఫిలిం మేకింగ్‌లోని ఏ క్రాఫ్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నవారికయినా  వర్తిస్తాయి. ఏమంటారు?   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani