కట్ చేస్తే -
"నేనింతే" అన్న పదంలో కావల్సినంత నెగెటివిటీ ఉంది. కేర్‌లెస్‌నెస్ ఉంది. "నాకేంటి?" పదంలో .. విల్ పవర్ ఉంది. ఛాలెంజ్ ఉంది. డిమాండ్ ఉంది. అధికారం ఉంది.
అసలు బ్లాగ్ ఎందుకు రాయడం అన్నదానికి.. ఒక్కో వ్యక్తి ఆలోచనాధోరణిని బట్టి, నేపథ్యాన్ని బట్టి సమాధానం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. ఈ విషయంలో.. ఒకరు చెప్పిన కారణం మరొకరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు. చాలా సహజమైన విషయం.
నా విషయానికొస్తే మాత్రం ఇదీ కారణం: యాక్సిడెంటల్‌గా ప్రారంభించినా - ఎప్పుడో దశాబ్దం క్రితం మర్చిపోయిన/వదిలేసిన "రాయడం" అనే నా అత్యంత ప్రియమైన హాబీని తిరిగి ట్రాక్ మీదకి తెచ్చుకోవడం కోసం ఈ బ్లాగింగ్ నాకు చాలా ఉపయోగపడింది. అది కంటిన్యూ అవుతోంది.
ఈ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. దాదాపు రెగ్యులర్‌గా ఏదో ఒకటి బ్లాగ్ కోసం రాస్తున్నాను.
పనిలో పనిగా, ఫ్యూచర్‌లో నేను రాసి, పబ్లిష్ చేయాలనుకుంటున్న పుస్తకాలూ రాస్తున్నాను.
బ్లాగ్ రచయితకయినా, ఏ రచయితకయినా తను రాయాలని అనుకున్నది రాసే స్వతంత్రం ఉంటుంది. ఉండాలి. ఈ రాతలకి ఏదయినా ప్రయోజనం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. "నేనింతే" అనుకొని, ఆ క్షణాన ఏది రాయాలనుకొంటే అది రాయడం. అంతే.
కట్ టూ "నాకేంటి?" -
ఎంత "నేనింతే" అనుకొని రాసినా, బ్రతకాలంటే మాత్రం ఈ రోజుల్లో "నాకేంటి?" అన్న ఆలోచన తప్పనిసరి.
"క్విడ్ ప్రో కో" అన్నమాట!
ఈ ఆలోచనలోంచి పుట్టిందే నా కొత్త బ్లాగ్ "సినిమా తీద్దాం రండి!"
అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ బ్లాగ్‌లో సుత్తి ఉండదు. సూటిగా విషయం ఉంటుంది. నాక్కావల్సిన అవసరం ఉంటుంది. కొత్త టాలెంట్‌కు కావల్సిన రియలిస్టిక్ సమాచారం ఉంటుంది.
ఏ పోస్టూ 10-15 లైన్లకు మించదు. మించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఇదో కొత్త ప్రయోగం.
కట్ టూ నాన్-ఫిలిమ్ లవర్స్! -
నాకు తెల్సు. ఈ కొత్త బ్లాగ్ అందరికీ నచ్చదు. సినిమాలంటే పడనివాళ్లకు అసలే పడదు. సో, పడినవాళ్లు చదవండి సరదాకి. పడనివాళ్లు ఎక్కడయితే "ఇది సూటవుతుంది"అని మీకనిపిస్తుందో అక్కడ దీని లింక్ ఒకటి అలా పడేయండి.
ఇతర బ్లాగ్ కామెంట్స్‌లో కావొచ్చు. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజ్‌లు, గ్రూపుల్లో కావొచ్చు. ఇంకెక్కడయినా కావొచ్చు. ఎక్కడ సూటవుతుందన్నది, ఎవరికి ఉపయోగపడుతుందన్నది మీకే బాగా తెలుస్తుంది.
ఈ కొత్త బ్లాగ్ "సినిమా తీద్దాం రండి"ని పైన చెప్పిన విధంగా లింక్ చేయడంద్వారా నాకు చాలా సహాయం చేసినవారవుతారు. అదీ ప్రారంభంలోనే అవసరం.
మీరు చేయబోయే ఈ చిన్ని సహాయానికి ముందే మీకు మిలియన్ థాంక్స్ చెబుతున్నాను.
కట్ టూ మళ్లీ మన టాపిక్ -
"అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఎలా?" అన్న టాపిక్ మీద - గెరిల్లా ఫిలిం మేకింగ్, లో బడ్జెట్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్, మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్, వన్ మ్యాన్ క్రూ ఫిలిం మేకింగ్.. వంటి ఎన్నో పధ్ధతులను.. నా వ్యక్తిగత ఆసక్తితో, అవసరంతో పరిశోధన చేస్తున్న నాకు.. నా ఆలోచనలతో సరితూగే లైక్‌మైండెడ్ టీమ్ చాలా అవసరం.
ఈ నేపథ్యంలోనే - సినీఫీల్డులోకి ఎంటరవ్వాలనుకొనే ఔత్సాహికులకు నా బ్లాగ్ పోస్టింగ్స్ ద్వారా అవసరమైన రియలిస్టిక్ సమాచారాన్ని ఇస్తాను. అదే ఔత్సాహికుల్లోంచి నాక్కావల్సిన టీమ్‌ని నేను తయారు చేసుకుంటాను.
కొత్త టాలెంట్‌కూ, నాకూ మధ్య ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం.
అతి త్వరలో మీరు చదవబోతున్న నా కొత్త బ్లాగ్‌కి సంబంధించి - "నాకేంటి?" అనబడే నా "క్విడ్ ప్రో కో" ఇది.
ఒక పరిపూర్ణమయిన పాజిటివ్ ఆలోచన.
కొన్ని గంటల్లోనే, అంటే.. ఈ 4.4.2014 అర్థరాత్రి దాటకముందే ఈ కొత్త బ్లాగ్ లైవ్‌లోకి వస్తుంది.
విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani