సుకుమార్-మహేష్‌బాబుల ప్రతిష్టాత్మక చిత్రం "1" (నేనొక్కడినే) డిస్ట్రిబ్యూషన్/మార్కెట్ హక్కుల్ని ప్రముఖ మీడియా కార్పొరేట్ సంస్థ ఇరోస్ అక్షరాలా 72 కోట్లకు కొనుక్కున్నట్టు సమాచారం.
ఇదే నిజమయితే - మహేష్‌బాబు "1" చిత్రం .. ఇటీవల బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన త్రివిక్రమ్-పవన్ ల చిత్రం "అత్తారింటికి దారేది" కలెక్షన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. మహేష్‌బాబు ఎంత టాప్ హీరో అయినప్పటికీ, అదంత సులభం కాదని నా ఉద్దేశ్యం. చిత్రం పైన "సూపర్ డూపర్ హిట్" టాక్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
ఏ మాత్రం అటూఇటూ అయినా ఇరోస్ చతికిలపడిపోవాల్సి వస్తుంది. 72 కోట్లు మఠాష్ అవక తప్పదు. అందుకే ఇది హెవీ గ్యాంబ్లింగ్ ఒకరకంగా.
సుకుమార్-మహేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంగా "1" పైన ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో కూడా. మరోవైపు, మహేష్ కి దేవిశ్రీప్రసాద్ మొదటిసారిగా సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే కావడం ఇంకో విశేషం. అంతే కాదు. మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెరమీద కనిపించబోతున్నాడు!
వీటన్నిటి నేపథ్యంలో, మహేష్ అభిమానుల భారీ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో కూడా ఇట్టే ఊహించవచ్చు.
ఇప్పటికే తెలుగు, ఇతర సౌత్ చానెల్స్ నుంచి "1" చిత్రానికి శాటిలైట్ రైట్స్ 12 కోట్లు వచ్చిందని మార్కెట్లో సమాచారముంది.
ఇక ఏరియావైజ్ సేల్స్ విషయానికొస్తే - తెలంగాణ నుంచి సుమారు 14 కోట్లు, ఆంధ్ర నుంచి 20 కోట్లు, సీడెడ్ నుంచి
8 కోట్ల బిజినెస్ అంచనా వేస్తున్న ఇరోస్‌కు, మిగిలిన ఎన్ని సోర్స్‌ల ద్వారా లెక్కించినా, కనీసం ఓ 10 కోట్ల రిస్క్ ఉంది.
అదీ హిట్ అయితేనే. అదికూడా ..బ్రేక్ ఈవెన్ కోసమే!
"పెట్టిన డబ్బు రావడం కోసమే ఇంత గ్యాంబ్లింగ్ ఆడటం దేనికి?" అని మనకు అనిపించడం సహజం. కార్పొరేట్ ఆటలు ఇలాగే ఉంటాయి. ముందు సౌత్ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోవడం వాళ్లకి ముఖ్యం. తర్వాత ఎంత డబ్బయినా సంపాదించుకొనే ప్లాన్లు వాళ్లదగ్గర బోలెడన్ని ఉంటాయి.
ఈ కోణంలో చూస్తే మాత్రం - ఇరోస్ ఆడుతున్నది ఏమంత పెద్ద గ్యాంబ్లింగ్ కాదు.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani