బాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో పోటాపోటీగా ఉన్న దీపికా పడుకొనే, కత్రినా కైఫ్‌ల్లో .. దీపిక 4 వరుస సూపర్ డూపర్ హిట్స్‌తో 2013 ను దాదాపు ఏలేసింది. హిట్ అయిన ఆ 4 చిత్రాలూ (రేస్ 2, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్-లీల) 100 కోట్ల క్లబ్‌ని క్రాస్ చేసినవే కావడం విశేషం!
ఈ కోణంలో చూస్తే, 2013లో కత్రినా నటించిన చిత్రం కేవలం ఒకే ఒక్కటి విడుదలయింది. ఆ ఒక్క చిత్రం కోసం కత్రినా చాలా కష్టపడిందనే చెప్పవచ్చు. ఆమె కష్టం ఫలించింది.
సినిమాలో ఓ మెరుపుతీగలా "వావ్!" అనిపిస్తూ తళుక్కుమంది.
ఆ చిత్రం ఇపుడు ఏకంగా బాలీవుడ్ చరిత్రలోనే 300 కోట్ల కలెక్షన్ను దాటి 400 కోట్ల ఫిగర్‌ని తాకబోతోంది!
అదే "ధూమ్ 3" ..
మేకింగ్‌లో కొత్త టెక్నాలజీ, అమీర్ ఖాన్, బైక్‌ల మాయాజాలం తప్ప మరొకదాని గురించి అంతగా చెప్పుకోడానికి ఏమీలేని "ధూమ్ 3" సాధిస్తున్న విజయం అందరికన్నా కత్రినాకే బాగా ప్లస్ అయింది. (అమీర్ ఖాన్ కు కొత్తగా ఏం కావాలి?) బాలీవుడ్ టాప్ రేంజ్‌లో ఆమె స్థానం మళ్లీ మరింత పదిలమయిపోయింది. కొత్తగా కత్రినాకు మరింత క్రేజ్ సంపాదించిపెట్టింది.
కట్ టూ రెండు పాయింట్స్ -
కనిపించినంతసేపూ కళ్లుచెదిరేలా కనిపించినా - "ధూమ్ 3" చిత్రం మొత్తంలో కత్రినా కనిపించింది కేవలం ఓ 15 నిమిషాలే! ఈ కోణంలో చూస్తే - భిన్న చిత్రాల్లో, వైవిధ్యమైన ఛాయలున్న అద్భుత పాత్రల్ని పోషించి మెప్పించే అవకాశం 2013లో దీపికకే దక్కింది.
మరోవైపు, బికినీలో రణబీర్ కపూర్‌తో స్పెయిన్‌లో పర్సనల్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తూ దొరికిపోయిన పిక్స్ ఇంటర్నెట్లో వీరవిహారం చేయటం కూడా కత్రినాకు 2013లో ఎక్కడలేని ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.
"ధూమ్ 3" భారీ హిట్టే కానీ, అది కేవలం కత్రినా ఒక్కదాని మాయాజాలం కాదు. అలాగే, పర్సనల్ పాపరాజీ ఫోటోలు తెచ్చే పాప్యులారిటీ కూడా ఏ స్టార్‌నీ ఎంతోకాలం నిలబెట్టదు.
కానీ, ఈ రెండే 2013లో కత్రినాకు బాలీవుడ్‌లో మరింత భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి!
"షో బిజినెస్" అంటే ఇదే ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani